India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మెట్టూరులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఇదే గ్రామంలో ఈ నెల 2న ఓ పాడుబడిన ఇంట్లో ప్రవేశించిన ఎలుగుబంటిని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. గ్రామంలో గురువారం చీకటి పడే సమయానికి మరో ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరించిన ఎలుగు జీడి తోటలోకి వెళ్లిందని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన మేడిశెట్టి వీరబాబు తన పెళ్లి కార్డులో పవన్ చిత్రంతో పాటు ఎన్నికల హామీలను వేయించారు. అందులో ‘‘పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఇలా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. చేనేత రంగం ప్రగతి’’ తదితర అంశాలు ఉన్నాయి. పవన్ విజయానికి సహకారం అందించాలనే ఇలా చేశానన్నారు.
సంతమాగులూరు మండలం పుట్ట వారిపాలెం గ్రామంలోని ప్రమీల సీడ్స్ యజమాని చిరుమామిళ్ల సురేంద్ర గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం దుకాణానికి వచ్చిన సురేంద్ర పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన షాపులోని గుమస్తా బాధితుడిని హుటాహుటీన నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సురేంద్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్ర, శనివారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని 25 మండలాల్లో తీవ్రవడగాలులు, 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శనివారం 23 మండలాల్లో తీవ్ర, మరో 18 మండలాల్లో వడగాలులు వీయొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాజుపాలెం మండలం కూలూరు గ్రామం కుందూ నది వద్ద ట్రాక్టర్ కిందపడి డి.పెద్ద ఓబులేసు (35) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడుకు చెందిన పెద్ద ఓబులేసు పొలానికి మట్టి కోసం ట్రాక్టర్ తీసుకొని కుందూ నది వద్దకు వచ్చారన్నారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి చెందిన ఆరుగురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబాపురం సర్పంచి గండికోట సీతయ్య, మాజీ ఎంపీపీ తోడేటి రూబేను ఆధ్వర్యంలో వాలంటీర్లతో పాటు పలువురు టీడీపీలో చేరారు.
మాజీ CM చంద్రబాబు నాయుడు రేపు 10:30 గంటల నుంచి 1గంట వరకు నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్‌లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారని నాయకులు తెలిపారు. అనంతరం 2:15 గంటలకు నల్లజర్ల ఏకెఆర్జి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బహిరంగ సభలో మాట్లాడుతారు. 6:00 నుంచి 7:30 వరకు పాలకొల్లులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏలూరు జిల్లాలో 2,70,804 లబ్ధిదారులు ఉండగా గురువారం రాత్రి 8 గంటల వరకు 2,43,795 మందికి సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు వెల్లడించారు. పెన్షన్ పంపిణీ నిమిత్తం జిల్లాకు రూ.80.92 కోట్లు విడుదలయ్యాయని అన్నారు. ఇంతవరకు రూ.73.89 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గురువారం వరకు 90 శాతం పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు.
సామర్లకోట- పెద్దాపురం ఏడీబీ రహదారిలో గురువారం సాయంత్రం ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. పెద్దాపురం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఓ వాహనంలో ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.48 లక్షలు పట్టుబడినట్లు ఫ్లైయింగ్ స్క్యాడ్ అధికారి రామారావు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు ఆదేశాల మేరకు నగదును కాకినాడ ట్రెజరీకి జమ చేస్తున్నట్లు తెలిపారు.
బీఈడీ (ఎంఆర్) కోర్సులో డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తక్షణ ప్రవేశాలు నిర్వహించనుందని వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ నెల 6 నుంచి వీటిని వర్శిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించనున్నామని తెలియజేశారు. టీసీతో పాటు విద్యార్హతలతో కూడిన ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, నాలుగు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు.
Sorry, no posts matched your criteria.