India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వ శ్రేష్ట త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఐజీగా పనిచేసిన పాలరాజుని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయగా ఆయన స్థానంలో త్రిపాఠిని నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని గుంటూరు ఎస్పీ తుషార్ దూడి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఐజీ తెలిపారు.
తెలంగాణలోని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ వరకు జరిగిన నంది అవార్డులలో కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు వరించాయి. ఉత్తమనటుడుగా శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ నటిగా సురభి ప్రభావతి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ మేకప్ మాన్ విభాగాలలో నంది అవార్డులు లభించాయని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో విధులకు సంబంధించి ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, వాటిని శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలన్నారు.
నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతుల నిర్వహణతో అన్ని అంశాల్లో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, నెల్లూరు నగరంలోని స్థానిక డి.కె. మహిళా కళాశాలలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదు ఇచ్చామని, సందేహాలకు తావులేకుండా మాస్టర్ ట్రైనర్స్ వివరించారని తెలిపారు.
ప్రయాణికుల రద్దీ మేరకు నేడు గురువారం విజయవాడ మీదుగా బరౌని- కోయంబత్తూరు (నెం.05279) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఈ రోజు రాత్రి 23.42 గంటలకు బరౌనిలో బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు దువ్వాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) జిల్లాలో గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40.4
☞ఉయ్యూరు 39.9
☞బాపులపాడు 40.6
☞గుడివాడ 39.5
☞గన్నవరం 40.7
☞పెనమలూరు 40.7
☞ఉంగుటూరు 40.4
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.9
☞పామర్రు 39.1
నెల్లూరు జిల్లాలో పోలింగ్ నిర్వహణకు 14, 945 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో ఎన్నికల పోలింగ్ అధికారులను కేటాయించడానికి మొదటి విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2, 900 మంది పోలింగ్ అధికారులు, 2,914 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 9,131 మంది ఇతర పోలింగ్ అధికారులు అని తెలిపారు.
పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ రామకృష్ణ(54) గత కొంతకాలంగా చేపల చెరువుకు
కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. తుమరాడ గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద గురువారం ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
టి.నర్సాపురం మండలం కే.జగ్గవరం గ్రామానికి చెందిన వ్యక్తి 2019 జూన్ 13న రాత్రి జరిగిన గొడవలో అడ్డు వచ్చిన ఓ మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సదరు నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఎస్పీ మేరీప్రశాంతి గురువారం తెలిపారు. రూ.300 నగదు కోసం గొడవ మొదలు కాగా.. గొడ్డలి దాడి వరకు వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.
విశాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్-1 మణికంఠ చందోలును ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇటీవలే ఆయన విశాఖ డీసీపీగా బదిలీపై వచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మణికంఠను చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేసింది. మణికంఠ చందోలు 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
Sorry, no posts matched your criteria.