India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కర్నూలు నగర ప్రజలకు ఏప్రిల్ రెండవ వారం నుంచి రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్షభావ పరిస్థితుల వల్ల సుంకేసుల రిజర్వాయర్లో నీరు అడుగంటిపోయిందన్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజులదిన్నె నుంచి కేసీ కెనాల్ ద్వారా నీరు తీసుకొస్తున్నామని ఆయన వివరించారు.
కాశినాయన మండలం కొండరాజుపల్లికి చెందిన సునీత(22) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త సిద్దులు తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సునీత గురువారం ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ కాశన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67 శాతం పింఛన్లు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇంటర్ విద్యార్థులకు మార్చి 28 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా వృత్తి విద్యాధికారిణి మంజుల వీణ తెలిపారు. జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు. సెలవుల్లో కళాశాలలో ఎటువంటి క్లాసులు నిర్వహించరాదని సూచించారు. షెడ్యూల్ విడుదల కాకుండా.. ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీకాకుళం పార్లమెంట్ (ఎంపీ) స్థానానికి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడుతున్న ఓట్లు సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. 2014 శ్రీకాకుళం ఎంపీ స్థానానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు 6,133 (0.58 శాతం) ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో నోటాకు 25,545 (2.19 శాతం) ఓట్లు వచ్చాయి. 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికల కమిషన్ ఈవీఎం యంత్రాల్లో నోటాకు స్థానం కల్పించింది.
పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.
రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.
పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబందిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ స్టేషన్స్ పరిధిలో రాత్రి వేళ మరింత గస్తీని పెంచుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆయా స్టేషన్స్ పరిధిలో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫారం-6, 8లను 16 వరకు స్వీకరించి వాటిని 25వ తేదీ వరకు క్లియర్ చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.