India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బలిజిపేట సీడీపీఓగా పని చేస్తున్న సుగుణ కుమారి గురువారం మృతి చెందారు. గురువారం ఉదయం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమెకు తీవ్ర తల నొప్పి వచ్చింది. విజయనగరం ఆసుపత్రి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. పాచిపెంటలో సూపర్ వైజర్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై బలిజిపేట సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఎస్పీగా 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సుమిత్ సునీల్ ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటలలోపు విధుల్లోకి చేరాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నాయుడుపేటలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తారు.
కొవ్వూరు ‘ప్రజాగళం’ సభలో TDP అధినేత చంద్రబాబు అనపర్తి టికెట్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జనసేన 2చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన 5 స్థానాల్లో ఒక అసెంబ్లీ సీటు BJPకి ఇచ్చాం. BJPకి ఇచ్చిన అసెంబ్లీ సీటు ఇంకా నిర్ణయం కాలేదు. MP అభ్యర్థిగా పురందేశ్వరీ పోటీ చేస్తున్నారు’ అని అన్నారు. కాగా.. అనపర్తి టికెట్ BJPకి ఇవ్వగా.. నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే.
ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా సాగిన రాక్షస పాలనకు అంతం పలుకుదామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్‌లో తన బహిరంగ సభకు కదలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే.. 50వేల మెజారిటీలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు తలుచుకుంటే వైసీపీ పాలన నేలమట్టమవుతుందని చెప్పారు. ధర్మవరంలో వైసీపీ పాలన తొలగి.. ప్రజాపాలన రావాలని సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ నియమితులయ్యారు. కాగా ఈయన గతంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన బిందుమాధవ్ పశ్చిమగోదావరి జిల్లా గ్రేహౌండ్స్, రంపచోడవరంలో అసిస్టెంట్ ఎస్పీగా, ఎస్‌ఈబీ గుంటూరు రూరల్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు.
కర్ణాటక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు వేకువజామున 3 గంటలకే ఆలయ తలుపులు తెరిచి స్థానిక అభిషేక, అర్చన పూజల అనంతరం అష్టవిధ మహా మంగళహారతులు పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వేకువజామున 4 గంటల నుంచి 6: 30 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
సోదరుడు రమణ మరణానంతరం 1999 నుంచి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1999, 2004లో నందిగామలో గెలిచిన ఉమ ఆ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2009,14,19లో మైలవరంలో పోటీ చేశారు. 2019లో మినహా ఆయన ప్రతిసారి గెలుపు సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ అధిష్ఠానం మైలవరం టికెట్ వసంతకు కేటాయించడంతో ఉమ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.
భీమిలి చిన్న ఉప్పాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెప్పల నాగభూషణం అలియాస్ జాన్ (35) బీచ్ రోడ్ సమీపంలో సూపర్వైజర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలతో చేపలుప్పాడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు నాగభూషణంకు నిప్పంటించడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బందువులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 8 గంటల లోపల బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది గుంటూరు ఎస్పీగా విధులు నిర్వహించి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.