India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లిమర్ల-విజయనగరం రైల్వే ట్రాక్ మధ్య గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు విజయనగరం జీఆర్పి పోలీసులు గురువారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. కాఫీ, సిమెంట్ కలర్ పువ్వులతో కూడిన షర్ట్ ధరించాడు. మృతుడి వివరాలు గుర్తించిన వారు స్థానిక స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలోనే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం పీసీపల్లి మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా 2018..IPS బ్యాచ్‌కి చెందిన మణికంఠ చందోలును నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ని నియమించింది.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డీకే బాలాజీని కృష్ణా జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విధుల్లో ఉన్న రాజబాబుపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాలకు అధికారులు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఎన్నికల అధికారులు సిబ్బంది ఈనెల 10, 12వ తేదీల్లో నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరుకావాలని అన్నారు.
చౌడేపల్లి పట్టణంలోని బజారు వీధిలోని ఓ ఇంట్లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం.. స్థానిక ఉన్నత పాఠశాలలో సాయి రితీష్ (14) అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన పుస్తకాలు ఉన్న బ్యాగుతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి హేమ కళ్యాణి స్థానిక సచివాలయ ఉద్యోగిగా ఉంది. సాయి రితీష్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీఈడీ (ఎంఆర్) కోర్సులో డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తక్షణ ప్రవేశాలు నిర్వహించనుందని వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ నెల 6 నుంచి వీటిని వర్శిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించనున్నామని తెలియజేశారు. టీసీతో పాటు విద్యార్హతలతో కూడిన ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, నాలుగు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు.
మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్‌లో https://machhlipatnam.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 1వ తరగతిలో అడ్మిషన్లకై ఆరేళ్ల వయస్సున్న విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కారంపూడి మండలంలోని కారంపూడి పట్టణానికి చెందిన 50 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఎంపీడీఓ గంట శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అలాగే వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంపిణీ చేయొద్దంటూ ఆంక్షలు విధించింది. దీంతో వారు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
Sorry, no posts matched your criteria.