India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలో రూ. 91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు సీఐ, పోలీసులు తనిఖీ చేయగా లారీలో ఒక బాక్సులో రూ. 91 లక్షలు నగదు గుర్తించారు. డ్రైవర్ సయ్యద్ మహబూబ్ బాషా బెంగళూరు నుంచి లారీని తీసుకొస్తుండగా సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
పెదపాడు మండల పరిధిలోని తాళ్లమూడి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో టీడీపీ నాయకులు సుగ్గసాని గంగయ్యతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి దుగ్గిరాల వస్తున్న చింతమనేని ప్రమాద పరిస్థితిని చూసి హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నరసాపురంలో నిర్వహించే బహిరంగ సభకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో చంద్రబాబు హెలికాప్టర్‌లో దిగనున్నారు. అక్కడి నుంచి నరసాపురం వరకు రోడ్ షో నిర్వహించి, సభలో ప్రసంగిస్తారు.
పూసపాటి రేగ మండలంలోని కొల్లాయి వలస గ్రామానికి చెందిన సాడి రాజు (25), తండ్రి పైడితల్లి ఆటో నడుపుకునేవాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు గడియ పెట్టుకుని ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకున్నాడు. స్థానికులు సుందరి పేట హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళితుని శిరోముండనం కేసులో తుది వాదనలు బుధవారంతో పూర్తయ్యాయి. ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇతర నిందితులు విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధిక న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున కె.వి రామమూర్తి వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు ఇవ్వడానికి న్యాయమూర్తి శ్రీధర్ ఈ కేసును ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.1996 డిసెంబర్ 29న ఈ సంఘటన జరిగింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హౌరా-యశ్వంతపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారి బుధవారం తెలిపారు. ఈనెల 4, 11 తేదీల్లో ఈ రైలు (02863) హౌరాలో 12.40 గంటలకు బయలుదేరి విజయవాడ మరుసటి రోజు 07.25, గుంటూరు 08.20, యశ్వంతపూర్ శనివారం 00.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02864) ఈనెల 6, 13 తేదీల్లో యశ్వంతపూర్‌లో 5 గంటలకు ప్రారంభమై గుంటూరు 17.25 వస్తుంది.
కడియం మండలం బుర్రిలంకకు చెందిన ఈలి రుత్విక్ సంవత్సరం 6 నెలల వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘ఐబీఆర్ అచీవర్’ గా నిలిచాడు. 25 రకాల చర్యలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ బుడతడు ప్రతిభను మెచ్చుకొని పలువురు అభినందనలు తెలిపారు.
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.
టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.