Andhra Pradesh

News April 3, 2024

వై.పాలెం: కాంగ్రెస్‌లో చేరిన TDP మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి

image

యర్రగొండపాలెంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. బూదాల అజిత్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బుధవారం తాడేపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైపాలెంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని షర్మిల సూచించారు.

News April 3, 2024

ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలను చేపట్టండి: జేసీ

image

భీమవరం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ ప్రవీణ్ ఆదిత్య పౌరసరఫరాలు, వ్యవసాయ, కోపరేటివ్ శాఖ, తూనికల, కొలతలు అధికారుల, జిల్లా రైస్ మిల్లర్స్ సంఘంతో సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. గ్రేడ్ ఎరకం క్వింటాకు
రూ.2203 అందించి, ధాన్యం సేకరణ చేయాలన్నారు. 

News April 3, 2024

పూతలపట్టులో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

పూతలపట్టులో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షలపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం బస్సు యాత్ర పి.కొత్తకోట, పాకల క్రాస్, గదంకి, పనపాకం, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

News April 3, 2024

సూళ్లూరుపేటలో బానుడి ప్రతాపం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారటీ ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. సూళ్లూరుపేటలో అత్యధికంగా 43.1 డిగ్రీల సెంటిగ్రేడ్ సమోదుకాగా.. వాకాడు మండలంలో కనిష్టంగా 36.5 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు. ఎల్లుండి సూళ్లూరుపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

News April 3, 2024

TPT: క్రీడలపట్ల అవగాహన కల్పించిన భారత కెప్టెన్

image

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రజని టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడలకు సంబంధించి అవగాహన కల్పించారు. దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ ఆహ్వానం మేరకు బుధవారం ఆర్ట్స్ కళాశాలకు విచ్చేశారు. క్రమశిక్షణతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. క్రీడాకారులకు 20 హాకీ స్టిక్స్ బహుమతిగా అందజేశారు.

News April 3, 2024

కర్నూలు: ‘వైసీపీ నేతలను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’

image

వైసీపీ నేతలను అకారణంగా కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా విచక్షణా రహితంగా చేయి చేసుకోవడంపై మండిపడ్డారు.

News April 3, 2024

విజయవాడ: అత్యంత కీలకం కానున్న 29వేల ఓట్లు

image

2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్‌లో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు 29,333 ఓట్లు(16.48%) సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 25 ఓట్ల తేడాతో విష్ణు చేతిలో ఓడిపోయారు. పొత్తులో భాగంగా NDA నుంచి మళ్లీ ఉమను బరిలో దింపారు. కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఎం బాబురావుకు మరలా టికెట్ ఇచ్చే ఛాన్సుంది. దీంతో ఈసారి కూడా బాబురావుకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి.

News April 3, 2024

అవినాశ్ తప్పు చేశాడని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాచమల్లు

image

MP వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పు చేశాడని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది న్యాయ స్థానం నిర్ణయిస్తుందన్నారు. అవినాశ్ తప్పు చేశాడని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

News April 3, 2024

5వ తేదీలోపు పెన్షన్‌లు పంపిణీ పూర్తి చెయ్యాలి : కర్నూలు కలెక్టర్

image

ఈనెల 5వ తేదీ లోపు పెన్షన్‌ల పంపిణీ పూర్తి చేయలని కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూల్ కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్‌లో ఉన్నవారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వృద్ధ మహిళలకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేస్తామన్నారు.

News April 3, 2024

చిలకలూరిపేట: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య

image

మండలంలోని మురికిపూడి గ్రామంలో ఎద్దు ఏసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం చిలకలూరిపేటలో డీఎస్పీ వర్మ మాట్లాడుతూ.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మృతుడు ఏసుబాబు భార్య రజని, ప్రియుడు మురళీకృష్ణ, మరికొంత మంది కలిసి గత నెల 28వ తేదీన ఏసుబాబును హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.