Andhra Pradesh

News April 3, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో మొదలైన పెన్షన్ల పంపిణీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో పెన్షన్ల పంపిణీ మొదలైందని ఇంచార్జ్ పీడీ Y.సత్యంనాయుడు తెలిపారు. జిల్లాలో ఉన్న 15 మండలాలు 3 మున్సిపాలిటీల్లో మొత్తం 14,5409 మంది పెన్షన్ దారులకు ఇప్పటికే 621 మందికి వివిధ సచివాలయాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పాలకొండ మండలం లో అత్యధికంగా 270 మందికి అత్యల్పంగా సాలూరు మండలంలో ఒక్కరికీ అందివ్వడం జరిగింది. ఇంకా సాలూరు అర్బన్, సీతంపేట, కురుపాంలో ప్రారంభించాల్సి ఉంది.

News April 3, 2024

కృష్ణా: యాత్రికులకు శుభవార్త చెప్పిన రైల్వే

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా నడిచే హిసార్ (HSR), తిరుపతి (TPTY) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.09715 HSR- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 6 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం, నెం.09716 TPTY- HSR మధ్య నడిచే రైలును ఈ నెల 9 నుంచి మే 28 వరకు ప్రతి మంగళవారం నడుపుతామంది. కాగా ఈ రైళ్లు విజయవాడ, ఉజ్జయినితో పాటు మార్గమధ్యంలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News April 3, 2024

5 నుంచి కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

image

ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.

News April 3, 2024

విశాఖ: ‘ప్రత్యేక రైళ్లను జూన్‌ నెలాఖరు వరకు పొడిగింపు’

image

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రతి సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ (08579)ను జూన్‌ 26 వరకు, తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వచ్చే ఎక్స్‌ప్రెస్‌ (08580)ను జూన్‌ 27 వరకు పొడిగిస్తున్నామన్నారు.

News April 3, 2024

పవన్ కళ్యాణ్ నేటి తెనాలి పర్యటన రద్దు

image

నేటి సాయంత్రం తెనాలిలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెనాలిలో పర్యటన కోసం పార్టీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే.

News April 3, 2024

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు అనిల్ కుమార్ మృతి

image

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శ్రీ సత్య సాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతిచెందారు. దాదాపు 40 ఏళ్ల పాటు సత్య సాయిబాబా వద్ద అనువాదకుడిగా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 3, 2024

జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకు లిఖితారెడ్డి ఎంపిక

image

ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరగబోయే 51వ జాతీయ సీనియర్ క్యారమ్స్ పోటీలకు కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారిణి వి.లిఖితారెడ్డి ఎంపికైనట్లు జిల్లా క్యారమ్స్ సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపికల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి జాతీయ పోటీలకు ప్రాతినిథ్యం వహించే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.

News April 3, 2024

విశాఖ: గల్లంతయిన మత్స్యకారులు క్షేమం

image

విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల <<12976842>>ఆచూకీ<<>> లభ్యమయింది. వారంతా అప్పికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలియడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో వారంతా దానిపై భాగంలో ఉండిపోయారు. రాత్రి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నట్లు వారు సమాచారం అందించారు.

News April 3, 2024

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్

image

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ AC స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా – యశ్వంత్ పూర్ (02863) ట్రైన్ ఈ నెల 4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి అదేరోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ 6,13 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.

News April 3, 2024

కాకినాడ: కమ్యూనిటీ భవనంలో డెడ్‌బాడీ కలకలం

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలోని ఓ కమ్యూనిటీ హాల్ నందు మృతదేహం కలకలం రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయం స్థానికులు కమ్యూనిటీ హాల్లో ఒక వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.