Andhra Pradesh

News April 3, 2024

పొన్నూరు వద్ద ఆటో ఢీ.. వ్యక్తి మృతి

image

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు వద్ద జిబిసి రోడ్డుపై మంగళవారం ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లలూరుకు చెందిన చందు సురేంద్ర ద్విచక్ర వాహనంపై వస్తుండగా పొన్నూరు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2024

ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రగతి

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2023-24లో ఉత్పత్తి, అమ్మకాల్లో ప్రగతి కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో వైర్‌ రాడ్‌ కాయిల్స్‌ 7.30 లక్షల టన్నులు, స్ట్రక్చరల్స్‌ 5.08 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి మందు ఏడాది కంటే వృద్ధి సాధించింది. వినియోగదారులకు డోర్‌ డెలివరీ ప్రాతిపదికన 90 వేల టన్నుల ఉత్పత్తులను సరఫరా చేసింది. సీఎండీ అతుల్‌ భట్‌ సిబ్బంది, అధికారులు అభినందించారు.

News April 3, 2024

నెల్లూరు: వైసీపీ ప్రచారంలో హోంగార్డు..?

image

జిల్లాలోని కొండాపురం మండలం పెరికిపాలెంలో వైసీపీ ప్రచారం జరిగింది. ఇందులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 3, 2024

టీడీపీ నేతకు కండువా కప్పిన CM జగన్

image

చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన టీడీపీ నేత, జడ్పీ మాజీ ఛైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యం నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం జగన్ బస చేసిన అమ్మగారిపల్లె వద్దకు వెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం నాయుడితో పాటు మరికొందరు ఫ్యాన్ గూటికి చేరారు.

News April 3, 2024

కడప: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

చక్రాయపేట మండల పరిధిలోని సురభి గ్రామం నాగుల గుట్టపల్లెలో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని జవహర్ రోజ్ గార్ భవనం వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

News April 3, 2024

విశాఖ: వేతనాల కోసం ఉక్కు ఉద్యోగులు ఎదురుచూపు

image

విశాఖ ఉక్కు కార్మికులు ఈ నెల వేతనాలకు ఎదురు చూడక తప్పని పరిస్థితి. కర్మాగారం బీఐఎస్ఆర్కు నివేదించిన కాలంలోనూ ఇటువంటి పరిస్థితి రాలేదని కార్మికులు వాపోతున్నారు. నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు తదితర చెల్లింపులు చేయలేక ఆర్థికంగా, మానసికంగా సతమతమవుతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.

News April 3, 2024

VZM: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40 చొప్పున 160 సీట్లు ఉంటాయి. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 17 పాఠశాలల్లో 2,720 సీట్లను భర్తీ చేయనున్నారు.

News April 3, 2024

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ SPగా నాగేశ్వరరావు

image

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యతలు నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు జిల్లాలో ఏఎస్పీగా పని చేస్తున్న నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లాకు నూతన ఎస్పీని నియమించనున్నట్లు సమాచారం. 

News April 3, 2024

వజ్రపుకొత్తూరు: ఆలయాల్లో దొంగతనం.. ఆభరణాలు మాయం

image

వజ్రపుకొత్తూరు మండలం పూండి శివాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయాల్లోని ఆభరణలు, పంచపాత్రలు.. విలువైన వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల్లోని సీసీ ఫుటేజీలను సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిపై పోక్సో కేసు

image

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన రేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేపల్లె 8వ వార్డుకు చెందిన 4వ తరగతి చదివే బాలికపై సాయి పవన్ (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో కూలి పనులు చేసుకునే సాయి పవన్ ఇటీవల రేపల్లె వచ్చాడు. ఆడుకుంటున్న బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.