Andhra Pradesh

News April 3, 2024

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్

image

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ AC స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు
వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా – యశ్వంత్ పూర్ (02863) ట్రైన్ ఈ నెల 4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి అదేరోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. యశ్వంత్పూర్ 6,13 తేదీల్లో  అందుబాటులో ఉంటుందన్నారు.

News April 3, 2024

ప్రకాశం: రూ.2.35 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

image

ప్రకాశం జిల్లా అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు రూ.2.35 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి(నిన్న బదిలీ) వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 18 అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్ఠంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, మద్యం సీజ్ చేశారు.

News April 3, 2024

శ్రీ సత్యసాయి: ఉపాధ్యాయుడి సస్పెండ్‌

image

చిలమత్తూరు మండల పరిధిలోని వడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ డీఈఓ మీనాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్‌ ఎంఈఓ నాగరాజు మంగళవారం తెలిపారు. ఆదివారం చేనేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ తీవ్రంగా పరిగణించారు.

News April 3, 2024

నెల్లూరు: 8వ తేదీ వరకు పింఛన్లు

image

గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 8వ తేదీ వరకు నగదు అందజేస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,961 మంది లబ్ధిదారులుండగా.. వీరికి 95.77 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో తిరగలేని వారి వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి నగదు అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీకి ఒక్కో సచివాలయంలో 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

News April 3, 2024

శ్రీకాకుళం: ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు ఏడేళ్లు జైలు

image

అదనపు కట్నం కోసం వివాహితను వేదించిన కేసులో RPF కానిస్టేబుల్‌కు ఏడేళ్లు, కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళం సింగుపురానికి చెందిన లక్ష్మీ లావణ్య(27)ను సరుబుజ్జిలి మండలం రొట్టవలనకి చెందిన రవితో 2018లో వివాహమైంది. పెళ్లి తర్వాత ఆరు నెలల నుంచి ఆదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో ఆమె ఉరేసుకుంది.

News April 3, 2024

సచివాలయాల్లోనే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

సచివాలయాల్లోనే పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సచివాలయ సిబ్బంది అక్కడే ఉండి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలని కోరారు. వికలాంగులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. సచివాలయంలో హైబ్రిడ్ విధానంలో కౌంటర్స్ ఏర్పాటు చేసి పెన్షన్ పంపిణీ చేయాలన్నారు.

News April 3, 2024

బొండపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ బి. ఈశ్వరరావు వివరాల మేరకు మంగళవారం సాయంత్రం గరుడుబిల్లి గ్రామం సమీపంలోని పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. వయసు సమారు 45 సంవత్సరాలు, ఆకుపచ్చ చొక్కా, నీలం రంగు లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 3, 2024

నేడు తెనాలి రానున్న జనసేన అధినేత పవన్

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెనాలి మార్కెట్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సుమారు 6 గంటలకు బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News April 3, 2024

విధుల నుంచి నెల్లూరు ఎస్పీ రిలీవ్

image

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులు అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి బదిలీ అయ్యారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు బాధ్యతలు అప్పగించి తిరుమలేశ్వర రెడ్డి తన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. తిరుమలేశ్వరరెడ్డి గతేడాది ఏప్రిల్ 12న బాధ్యతలు స్వీకరించారు.

News April 3, 2024

విశాఖ: నేటి నుంచి పెన్షన్‌ల పంపిణీ

image

ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల పెన్షన్‌లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్‌ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.