Andhra Pradesh

News April 3, 2024

VZM: వడగాల్పులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

image

జిల్లాలో ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా వుంటూ ఎండల నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కోరారు. ఏప్రిల్, మే నెలలో 46. 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.

News April 3, 2024

పలాస: రూ. 2.50 లక్షలు సీజ్

image

పలాస మండలం కొత్తవూరు జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం ఎన్నికల తనిఖీలో బాగంగా వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందస మండలం స్రవంతి రెంటికోట నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్ళుతుండగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వెంకటరావు వాహనాన్ని తనిఖీ చేసి రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బులకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.

News April 3, 2024

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టండి: నంద్యాల కలెక్టర్

image

దేశంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 43.7 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో వడగాల్పులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News April 3, 2024

నేటి నుంచి 6వ తేదీ వరకు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నేటి నుంచి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్‌లో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు.

News April 3, 2024

అనంతపురం కలెక్టర్ బదిలీ.. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కేతన్ గార్గ్

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.

News April 3, 2024

ఒంగోలు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తప్పనిసరి

image

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రముఖుల ప్రొఫైల్ పిక్ తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 3, 2024

చిత్తూరు: నాలుగు రోజుల్లో పెన్షన్ ప్రక్రియ పూర్తి చేయండి

image

జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పెన్షన్ ల పంపిణీ ఈ నెల 3 వ తేదీ నుంచి 6 వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందిని ఎంపిక చేసి ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.

News April 3, 2024

కృష్ణా: పీహెచ్‌డీ/ఎం.ఫిల్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ/ఎం.ఫిల్ పార్ట్-1 విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల (రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News April 3, 2024

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు 100 శాతం ఎన్నికల శిక్షణకు హాజరు కావాలని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. హాజరు కాని సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొనేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఎవరైతే శిక్షణకు గైర్హాజరవుతారో వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు

News April 3, 2024

తూ.గో: మంత్రి వేణు వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

వాలంటీర్లపై టీడీపీ కక్ష కట్టిందని సమాచార శాఖ మంత్రి, రూరల్ వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం కడియంలోని గిరజాల రైస్‌మిల్ ఆవరణలో మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ఎందరో వికలాంగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న వాలంటీర్లను కించపరచడం టీడీపీకి తగదన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?