Andhra Pradesh

News April 3, 2024

బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జేడీ శీలం నేపథ్యమిదే..

image

బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జేడీ శీలం పోటీ చేయనున్నారు. పెద‌నందిపాడు మండ‌లం పూసులూరులో జ‌న్మించిన జేసుదాసు శీలం.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తి. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఏంఎస్సి పూర్తి చేశారు. 1984-99 మధ్య IAS అధికారిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి ఓటపోయారు. 2004 నుంచి 2016 వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

News April 2, 2024

ప.గో.: రూ.50 వేలకు మించి తీసుకెళ్తే నగదు సీజ్

image

ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ వాహన తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 50 వేలకు మించి నగదు సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తున్నారు. కావున నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 2, 2024

గుంటూరు: రూ‌. 1,84,77,900 విలువైన నగదు, మద్యం సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు జరిపిన తనిఖీలలో మంగళగిరి పరిధిలో 19.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పరిధిలో రూ.1,24,350 నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ.1,75,000 నగదు సీజ్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,84,77,900ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News April 2, 2024

ఎన్టీఆర్: పన్ను చెల్లింపుదారులకు పోలీసుల హెచ్చరికలు

image

ఆదాయ పన్ను చెల్లించేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సందేశాలు, లింకులు పంపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా సీపీ TK రాణా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదాయ పన్ను రిఫండ్ కోసమంటూ వారు పంపే లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పవద్దని TK రాణా సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని ఆయన జిల్లా ప్రజానీకాన్ని హెచ్చరించారు.

News April 2, 2024

టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారులు

image

తాడిపత్రి వైసీపీ మాజీ సమన్వయకర్త VR రామిరెడ్డి కుమారులు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. VR రామిరెడ్డి 2014 ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి VR రామిరెడ్డి కుమారులు VR వెంకటేశ్వర రెడ్డి, VR విగ్నేశ్వర రెడ్డి టీడీపీలో చేరారు.

News April 2, 2024

విజయనగరం: జనసేనలో చేరిన వాలంటీర్

image

విజయనగరం నియోజకవర్గంలో 37వ డివిజన్ స్థానిక బీసీ కాలనీలో వాలంటీర్‌గా పని చేస్తున్న గోక చక్రధార్ జనసేనలో చేరాడు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేననీ మరింత బలోతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు.

News April 2, 2024

అనంతపురం కలెక్టర్ బదిలీ.. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కేతన్ గార్గ్

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

News April 2, 2024

సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారుపై కేసు నమోదు

image

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెలగపూడి సచివాలయంలో గత నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మాట్లాడినట్లు, టీడీపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా తుళ్ళూరు సీఐ సుభాని సెక్షన్ 188, 171F కింద కేసు నమోదు చేశారు.

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.