India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SV యూనివర్సిటీ పరిధిలో గత
ఏడాది సెప్టెంబర్ నెలలో PG మొదటి సంవత్సరం ఏంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ అంత్రోపాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్‌లో చూడాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కడప పార్లమెంటు నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రేపు(బుధవారం) రానున్నారు. కొత్తపేట, ద్రాక్షారామ నందు నిర్వహించనున్న బహిరంగ సభలకు ఆయన హాజరవుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఈ సభలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏలూరు ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని ఎవరైనా కోరారా అని చంద్రబాబును అడిగారు. టికెట్ మార్పుపైనా చర్చించగా.. సీటు మార్చడం కుదరదని చంద్రబాబు స్పష్టంచేశారన్నారు. తనకు రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినట్లు మాగంటి మీడియాతో తెలిపారు.
కాకినాడ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా M.M పల్లం రాజును కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. ఈయన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. 2022 నవంబరు 23న ఏపీ కాంగ్రెస్ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. తాజాగా ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.
కావలి పట్టణంలోని వివిధ వార్డులకు సంబందించిన సుమారు 123 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కు సమర్పించారు. వారు మాట్లాడుతూ… మేమంతా తమకు అప్పగించిన విధులను నిర్వర్తించడం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తిని పొందామని, ప్రజల అభిమానం పొందడం గర్వ కారణంగా ఉందన్నారు. తమను విధుల నుంచి తొలగించడంలో టీడీపీ హస్తం ఉందని కొందరు అసహనం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలను జారీ చేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కోరింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో పాల్గొనకూడదని ఆదేశించింది.
టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి రూ.70వేలును ఎస్ఐ నాగేశ్వరరావు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం పింఛన్ల పంపిణీపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4,5 తేదీల్లోపు పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇచ్చాపురం – వసుపత్రి చక్రవర్తిరెడ్డి, పలాస – మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి, రాజాం – కంబాల రాజవర్దన్, పాలకొండ – చంటిబాబు.
Sorry, no posts matched your criteria.