Andhra Pradesh

News April 2, 2024

గ్రామాల్లో జరిగే అభివృద్ధి ప్రజల్లోకి: వైవీ సుబ్బారెడ్డి

image

గ్రామాల్లో జరిగే అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లానని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం బొబ్బిలి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొబ్బిలి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2024

పుట్టెడు దు:ఖంలోనూ ఓ కుటుంబం ఔదార్యం

image

పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానంతో ఔదార్యం చాటుకుంది ఓ కుటుంబం. ఇటీవల మారేడుబాకలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ కావడంతో రాజు(38) అనే వ్యక్తి కోమాలోకి చేరుకున్నాడు. అతడి భార్య మణి, కుటుంబ సభ్యులు రాజు అవయవాల దానానికి అంగీకారం తెలిపారు. విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రి నుంచి రాజు మృతదేహాన్ని స్వగ్రామం మారేడుబాక తీసుకు రానున్నారు. మృతుడికి పిల్లలు భార్గవ ప్రవీణ, అవినాష్ ఉన్నారు.

News April 2, 2024

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. పత్తికొండలో మంగళవారం ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ రామలక్ష్మి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2024

నాయుడుపేటలో ఇద్దరు కత్తులతో దాడి

image

నాయుడుపేట బీడీ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తిపై మస్కుద్, మౌళి అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రసాద్‌ను గొంతుపై కత్తితో కోయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి వచ్చేసరికి మస్కుద్, మౌళి పరారయ్యారు. గాయపడిన ప్రసాద్‌ను నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు… బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

image

పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు మంగళవారం ఉదయం జిల్లా పోలిసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాధిక అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో Lost Mobile Tracking System (LMTS) ద్వార 446 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. దీనితో బాధితులు సంతోషం వ్యక్తపరచి, జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, శ్రీనువాసు, ఉన్నారు.

News April 2, 2024

తిరుపతి: ఓటు నమోదుకు 14 వరకు అవకాశం

image

18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జీ.లక్ష్మీశ సూచించారు. మార్చి 16వ తేదీ వరకు జిల్లాలో 17.94 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో కొత్తగా ఓట్లు పొందిన యువకులు 30,508 మంది ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News April 2, 2024

కృష్ణా జిల్లాలో ఈనెల 7న చంద్రబాబు పర్యటన

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 7వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభను నిర్వహించబోతున్నారు. అయితే సత్తెనపల్లి నుంచి పామర్రులోకి ప్రవేశించి.. ఉయ్యూరు సెంటర్‌లో ప్రజాగళం భారీ బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

News April 2, 2024

అనంత: అసమ్మతి నేతలను బుజ్జగించిన సీఎం జగన్

image

సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిని చూసుకోకుండా వ్యవస్థను చూసి పనిచేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో శింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, తరిమెల గోకుల్ రెడ్డి, చెన్నంపల్లి రాజన్న, చాములూరు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.

News April 2, 2024

31 ఓట్ల అత్యల్ప మెజార్టీతో MLAగా ఎన్నిక

image

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1952-2019 వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1987వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈలి వరలక్ష్మి.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పి.కనక సుందరరావుపై 31 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరలక్ష్మికి 42,062 ఓట్లు రాగా.. కనక సుందరరావుకు 42,031 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ.

News April 2, 2024

బాపట్ల: పాము కాటుతో చిన్నారి మృతి

image

పిట్టలవానిపాలెం మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో పాము కాటుకు గురై 12 ఏళ్ల  బాలిక మృతి చెందింది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.