Andhra Pradesh

News April 2, 2024

‘దొంగ డాక్టర్’ కేసులో తవ్వుతున్న కొద్ది కొత్త విషయాలు

image

తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి వారికి మత్తు ఇంజక్షన్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఏలూరు-1 టౌన్ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఫిలిప్పిన్స్‌లో MBBS కోర్స్ చేస్తున్న కొవ్వూరి భానుసుందర్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలయ్యాడు. దీంతో వారిలో ఒకరికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి చావుకి కారకుడయ్యాడు. మరో మహిళ ఆసుపత్రిపాలైంది.

News April 2, 2024

పార్వతీపురం: ప్రారంభమైన రాయగడ గుంటూరు రైలు సర్వీసు

image

రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు పున ప్రారంభించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. గత కొన్ని రోజులుగా కొన్ని కారణాలవల్ల ఉన్నతాధికారుల ఈ రైలు సర్వీసును నిలిపివేసినట్లు తెలిపారు. నేటి నుంచి యధావిధిగా ఈ రైలు సర్వీసును పున ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులంతా ఈ రైలు సర్వీసులు వినియోగించుకోవచ్చన్నారు.

News April 2, 2024

అనంతసాగరం: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

అనంతసాగరం మండలం ఉప్పలపాడు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వైపు నుంచి బద్వేలు వైపు వెళ్తుండగా సిలికా లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.

News April 2, 2024

తిరుపతి: SPMVVలో రేపటి నుంచి ఒంటిపూట తరగతులు

image

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో బుధవారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ రజినీ ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 30 వరకు తరగతులు ఉంటాయని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

News April 2, 2024

పది’ మూల్యాంకనం ప్రారంభం: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైనట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 180 లక్షల జవాబు పత్రాలు వచ్చాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మూల్యాంకన ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు.

News April 2, 2024

విశాఖను ఫ్యాక్షన్‌కి అడ్డాగా మార్చారు: గంటా

image

ప్రశాంతంగా ఉండే విశాఖను ఫ్యాక్షన్ అడ్డాగా మార్చారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో రెల్లి వీధిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ధ్వజమెత్తారు. భూ దందాల్లో రౌడీ షీటర్లదే రాజ్యంగా మారిందని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. విశాఖలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు.

News April 2, 2024

సరుబుజ్జిలి: నవోదయ పాఠశాలకు 80 మంది ఎంపిక

image

సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు 80 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికైనట్లు నవోదయ ప్రిన్సిపల్ దాసరి పరశురామయ్య సోమవారం తెలిపారు. ఇటీవల నవోదయ నిర్వహించిన ప్రవేశ పరీక్ష లకు 7,170 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచామని పేర్కొన్నారు. వారంతా ఈ నెల 3వ తేదీన విద్యాలయంలో హాజరుకావాలని సూచించారు.

News April 2, 2024

అమెరికాలో పెనుగంచిప్రోలు మహిళ మృతి

image

అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో కొణకంచిలో విషాదం అలముకుంది.

News April 2, 2024

విధుల నుంచి 30 మంది తొలగింపు: కలెక్టర్

image

కర్నూలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 31 మందిపై చర్యలు తీసుకున్నామని, అందులో 30 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

గుంటూరు: భార్యకు తెలియకుండా కానిస్టేబుల్ రెండో పెళ్లి

image

కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించాడని భార్య సోమవారం పోలీసు కార్యాలయంలో, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్‌కి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గుంటూరులో కానిస్టేబుల్ పనిచేస్తున్న జనార్దనరావుతో పదహారేళ్ల కిందట వివాహమైందన్నారు. భర్త మరో యువతిని వివాహం చేసుకున్నాడని, నాకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసగించిన అతనిపై చర్యలు తీసుకొవాలని కోరారు.