Andhra Pradesh

News April 2, 2024

నెల్లూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ప్రభుత్వ టీచర్‌పై వేటు

image

వరికుంటపాడు మండలం రామదేవులపాడులో రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయసంకల్ప యాత్రలో వింజమూరు మండలం నందిగుంట ఉపాధ్యాయుడు జక్కం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై నోడల్ అధికారి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతయ్య తెలిపారు.

News April 2, 2024

కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

image

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.

News April 2, 2024

కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

image

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.

News April 2, 2024

స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా.. ఆశీర్వదించండి: పవిత్ర

image

మడకశిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆర్జీ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రధాన పార్టీలను చూసి చూసివిసిగిపోయారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే కుల, మత, పార్టీలకు అతీతంగా మడకశిరను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

News April 2, 2024

కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్

image

రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే 17 మంది అభ్యర్థుల జాబితాను పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి రాంపుల్లయ్య యాదవును ఎంపిక చేశారు. దీంతో యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లిఖార్జున యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

News April 2, 2024

ఈ నెల 4న నెల్లిమర్లకు పవన్

image

నెల్లిమర్ల రామతీర్థం కూడలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 4న ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్న స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సిబ్బందితో సమాలోచన చేశారు. విజయనగరం నుంచి పాలకొండ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సభ సజావుగా జరిగేలా బందోబస్తు చేపట్టాలని సూచించారు.

News April 2, 2024

విశాఖ: ఎంపీ ఎంవీవీపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే విశాఖలోని పెదజాలరిపేటలో జీవీఎంసీ కల్యాణ మండపాన్ని ప్రారంభించిన విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదు చేశామని తూర్పు రిటర్నింగ్ అధికారి, జేసీ మయూర్ అశోక్ తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 10 కేసులు నమోదు చేశామన్నారు. రూ.1.20 లక్షలు, 42 చీరలు, బీఎస్పీకి చెందిన ఒక ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 2, 2024

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట

image

ఈనెల 4వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట సెలవులు ఇస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ బి.శాంతి శ్రీ సోమవారం తెలిపారు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అన్ని కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు ఒంటిపూట సెలవులు ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యకర్త కేంద్రంలో ఉండాలన్నారు.

News April 2, 2024

కడప: అక్కడ సైకిల్ గుర్తు కనిపించదు

image

కడప జిల్లాలో 2 EVMలల్లో సైకిల్ గుర్తు కనిపించదు. పొత్తులో భాగంగా కోడూరు నుంచి భాస్కర్ రావు గాజు గ్లాసు గుర్తుమీద పోటీ చేస్తున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కోడూరు.. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఇక్కడ సైకిల్ గుర్తు ఈవీఎంలో ఉండదు. బద్వేలు, జమ్మలమడుగులో ఒక్క EVM(కడప ఎంపీ)లోనే సైకిల్ గుర్తు ఉండగా.. మిగిలిన 7 చోట్ల 2 ఈవీఎంలో TDP గుర్తు ఉంటుంది.

News April 2, 2024

విజయవాడ: ‘ఆ వాహనాలకు ఈ దారిలో అనుమతి లేదు’

image

విజయవాడ నగరంలో తిరిగే టిప్పర్ వాహనాల యజమానులతో పోలీస్ అధికారులు సోమవారం KS వ్యాస్ భవనంలో సమావేశమయ్యారు. గ్రావెల్ మొదలైన మెటీరియల్‌ను రవాణా చేసే టిప్పర్లు, కనకదుర్గ వారధి మీదుగా వారధి వైపునకు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. టిప్పర్లు గొల్లపూడి వై జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లాలన్నారు. టిప్పర్లపై టార్పాలిన్ కప్పి మెటీరియల్‌ రవాణా చేయాలని పోలీసులు టిప్పర్ల యజమానులను ఆదేశించారు.