India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శంఖవరం మండలం కత్తిపూడి శివారు ప్రాంతంలో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఆయిల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా
మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు(39)గా గుర్తించారు. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఉండవల్లిలోని నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా ఇటీవల అలకబూనిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన బృందంతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఏదైనా కార్పొరేషన్ పదవితో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆకిరి ప్రసాద్, కడగల ఆనంద్ తదితరులు ఉన్నారు.
విశాఖలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. విశాఖ జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.
అవనిగడ్డలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. ప్రస్తుతం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేడు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జనసేనలోకి వెళ్లడంతో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరో అనే చర్చ మొదలైంది. టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
విశాఖలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలో పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్‌లో ఉన్న కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.
పత్తికొండలో రేపు (మంగళవారం) కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన ఉంటుందని పత్తికొండ ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని వెల్లడించారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఇడుపులపాయ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తన తండ్రి దివంగత YSR సమాధి వద్ద నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం కడప లోక్ సభ స్థానం నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.