India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 3వ తేదీన కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు ఆ పార్టీ కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 చుట్టూ రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిలో సీఎం జగన్ రెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రమేయం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబిఐతో విచారణ నిర్వహించాలన్నారు.
ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.
జనసేన అధినేత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పిఠాపురంలో ఎన్నికల కార్యక్రమం వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా అక్కడ వైద్యపరీక్షలు చేయించుకొని సోమవారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకున్నారు. ఈ తరుణంలో ప్రచారానికి సంబంధించి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
అనంతపురంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను సోమవారం డీఈఓ బీ.వరలక్ష్మి, ఏసీ గోవింద నాయక్ కలిసి పరిశీలించారు. స్పాట్‌లో పాటించవలసిన నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించారు. విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు వైసీపీలో చేరారు. చిలమత్తూరు మాజీ ఎంపీపీ ఆన్సర్, లేపాక్షి మాజీ ఎంపీపీ హనోక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 60 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఆ రెండు పత్రికలు ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఆ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నది తప్పని విమర్శించారు. దేవుడు క్షమించడని అన్నారు.
Sorry, no posts matched your criteria.