Andhra Pradesh

News April 1, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో TDP, BJP సత్తా చాటగలవా?

image

గెలుపే లక్ష్యంగా అనేక సర్వేల అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 MP, 13 అసెంబ్లీ స్థానాలకు TDP, ఒక (ఆదోని) స్థానానికి BJP అధినేతలు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సర్వేల రిపోర్టును బట్టి YCP బలాలు, బలహీనతల దృష్ట్యా పలుచోట్ల అభ్యర్థులను మార్చారు. చంద్రబాబు నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

News April 1, 2024

విశాఖ:’ఖజానా ఖాళీ.. పెన్షన్లకు సొమ్ము లేదు’

image

రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. దీంతో పెన్షన్ సొమ్ము పంపిణీ 4వ తేదీకి వాయిదా వేసినట్లు విమర్శించారు. పెన్షన్ సొమ్ముతో పాటు వాలంటీర్లతో అక్రమంగా నగదు పంచే ఆలోచన కూడా వైసీపీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశించిందని అన్నారు.

News April 1, 2024

కాశినాయన: మహిళ అదృశ్యంపై ఫిర్యాదు నమోదు

image

కాశినాయన మండలం బాలయ్య పల్లెకు చెందిన బసిరెడ్డి స్వర్ణలత 16 రోజుల నుంచి కనిపించ లేదని కుటుంబీకులు తెలిపారు. వారు వెతికినా ఆచూకీ లభించలేదని కాశి నాయన మండలం ఎస్సై అమర్నాథ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9121100660 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

News April 1, 2024

శ్రీకాకుళం: పనసకు మంచి గిరాకీ

image

జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్‌, కటక్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.

News April 1, 2024

ధర్మారెడ్డి అహోబిలానికి రాలేదు: పీఠాధిపతి

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఖండించారు. తిరుమల స్వామివారిని సోమవారం ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ధర్మారెడ్డి తమ పీఠానికి రాలేదని చెప్పారు. అహోబిలం పీఠాధిపతి శ్రీశైలం గుహల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పట్లో ఓ వీడియో వైరల్ అయ్యింది.

News April 1, 2024

నెల్లూరు: ఎల్లుండి నుంచి పెన్షన్లు పంపిణీ

image

వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు, ఫోన్లు వెంటనే స్వాధీనం చేసుకోవాలని నెల్లూరు జడ్పీ సీఈవో కన్నమ నాయుడు ఆదేశించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

News April 1, 2024

చింతలపూడి మార్కెట్ వెనుక డెడ్‌బాడీ లభ్యం

image

ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

పెనమలూరులో మంత్రి జోగి గెలిస్తే చరిత్రే!

image

పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2019 ఎన్నికలు అప్పటి మంత్రులైన కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాకు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. 2019లో పెడన నుంచి గెలిచిన మంత్రి జోగిని సైతం సీఎం జగన్ పెనమలూరుకు బదిలీ చేయగా, టీడీపీ తమ అభ్యర్థిగా పెనమలూరులో బోడె ప్రసాద్‌ను నిలబెట్టింది. ఇక్కడ జోగి విజయం సాధిస్తారా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News April 1, 2024

తూ.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగర-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్‌-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి..?

News April 1, 2024

గూడూరు: టీచర్ మృతి

image

రైలు కిందపడి టీచర్ మృతిచెందిన ఘటన గూడూరులో వెలుగు చూసింది. గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్‌లో చెన్నై మెమూ రైలు దిగుతుండగా ప్రమాదశావత్తు జారిపడిపోయారు. రైలు కింద పడిపోవడంతో చనిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.