Andhra Pradesh

News April 1, 2024

విజయనగరం: ఏప్రిల్ 4 నుంచి పింఛను పంపిణీ

image

జిల్లాలో ఈనెల 4 వతేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పంపిణీ చేసే పింఛను ఆర్థిక సంవత్సరం చివరి రోజుకావడంతో అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 1 బ్యాంకుకు సెలవు, 2వ తేదీ పింఛను బడ్జెట్‌ను బ్యాంకు విడుదల చేస్తుంది. 3న వార్డు, సచివాలయ సిబ్బంది డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసుకుని 4 వ తేదీన పంపిణీ చేయనున్నారు.

News April 1, 2024

పరవాడ: మాజీ మంత్రి బండారుతో సీఎం రమేశ్ భేటీ

image

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ భేటీ అయ్యారు. పరవాడ మండలం వెన్నెల పాలెంలో బండారు స్వగృహానికి సీఎం రమేశ్, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్ వెళ్లారు. సీఎం రమేశ్ కొద్దిసేపు ఆయనతో చర్చించారు. తర్వాత పంచకర్ల కలవగా అనారోగ్యంగా ఉందని తర్వాత మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది.

News April 1, 2024

మండవల్లి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

image

మండవల్లి మండలంలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు ఈ నెల 26న భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెంది, రాత్రి కూల్ డ్రింక్‌లో ఎలుకుల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ.. మహిళ మృతిచెందినట్లు SI రామచంద్రరావు తెలిపారు.

News April 1, 2024

ఏలూరు: UPDATE.. యాసిడ్ దాడిలో మామ మృతి

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఆదివారం అర్ధరాత్రి నాగేశ్వరరావు(60) అనే వ్యక్తిపై <<12964707>>యాసిడ్ దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు హరీశ్ మామ నాగేశ్వరరావుపై యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది. హరీశ్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 1, 2024

పవన్.. ప్రజల మధ్య చిచ్చుపెడితే ఊరుకోం: వంగా గీత

image

పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీత జనసేనాని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చేబ్రోలు సభలో పవన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. MLA, MPగా తాను 100 ఆలయాలను అభివృద్ధి చేశానని, మతపరమైన విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. పవన్ గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వచ్చీరాని మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

News April 1, 2024

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

image

గుంటూరులో సోమవారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంటూరు క్రిస్టియన్ పేటకు చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి హతమార్చినట్లు పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత దూరం పరిగెత్తినప్పటికీ విడిచిపెట్టకుండా హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

ప్రకాశం: రూ.1,10,00,000 వరకు బకాయి.. విద్యుత్ నిలిపివేత

image

J. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీకి ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ పంచాయతీ సుమారు రూ.1,10,00,000 వరకు బకాయి ఉంది. గ్రామ పంచాయతీకి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులలో 20 శాతం విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని అధికారులకు చెప్పినా.. సరఫరా నిలిపివేశారని సర్పంచ్ పెంట్యాల కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.

News April 1, 2024

అనంత: సీఎం బస్సుపై చెప్పు విసరడంపై కేసు

image

సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై చెప్పు విసిరిన ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం శనివారం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

News April 1, 2024

పులివెందుల ఫస్ట్.. ఎర్రగుంట్ల థర్డ్

image

ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో పులివెందుల మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ కమిషనర్ తెలిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో పులివెందుల 83.90%తో ప్రథమ స్థానంలో నిలిచింది. కడప 82.8% ద్వితీయ స్థానం, ఎర్రగుంట్ల 77.30 % మూడో స్థానాల్లో ఉన్నట్లు కమిషనర్లు తెలిపారు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల కృషితో, వినియోదారుల సహకారంతో పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2024

శ్రీకాకుళం: 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,54,798 మంది రైతుల నుంచి 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు గాను రూ.980.56 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా ఇందులోనే చెల్లించామని పేర్కొన్నారు.