India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో ఓ బాలుడిపై ఆదివారం నగరంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలుడు గుంటూరులోని వసతి గృహంలో ఉంటూ చదువుతున్నాడు. అదే వసతి గృహంలో చదువుకుంటున్న బాలిక కొద్ది రోజుల క్రితం నుంచి కనిపించడంలేదు. బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుపై CI లోకనాథం పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంతవరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని వివరించారు. సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్ము ఇస్తారని లబ్ధిదారులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి పింఛన్లు పొందవచ్చని సూచించారు.
మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభకు వెళ్లినట్లు తేలటంతో ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పత్తికొండ ఎంపీడీవో డి.రామారావు తెలిపారు. మండలానికి చెందిన బుల్లేని పాండు, ఎర్రమల శివ నిబంధనలను అతిక్రమించి సిద్ధం సభకు వెళ్లడంతో విధుల నుంచి తొలగించామన్నారు. కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
మే 1వ తేదీన నుంచి 31వ తేదీ వరకూ జిల్లాలోని వివిధ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అండర్–14 విభాగంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శేషగిరి తెలిపారు. ఆసక్తి ఉన్న వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలన్నారు.
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఏప్రిల్ 5న కడపకు రానున్నారు. నగరంలోని ఓ షోరూమ్ ప్రారంభించేందుకు శ్రీలీల వస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి షోరూం నిర్వాహకులు కడప పట్టణంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అందరూ ఆదేశిస్తే S.కోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని టీడీపీ నాయకుడు గొంప కృష్ణ చెప్పారు. ‘ఎస్.కోటకు వచ్చి రెండేళ్లలో అందరి అభిమానం సంపాదించా. సేవ చేయడానికే ఇక్కడికి వచ్చా. నేను టీడీపీకి వ్యతిరేకం కాదు. ఇండిపెండెంట్‌గా గెలిచిన వెంటనే టీడీపీలో చేరుతా’ అని ఎస్.కోటలో నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో కృష్ణ అన్నారు.
కాకినాడ పార్లమెంటు నుంచి 2019లో YCPనుంచి పోటీచేసి గెలిచిన వంగా గీతకు తాజాఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ టికెట్ దక్కింది. దీంతో కాకినాడ MPసీటును YCP చలమలశెట్టి సునీల్‌కి కేటాయించింది. ఈయన ఇదేస్థానం నుండి 2009లో ప్రజారాజ్యం, 2014లో YCP, 2019లో TDP నుంచి పోటీచేసి ఓడిపోగా ఇప్పుడు సింపతీతో గెలుద్దామని వ్యూహాలు రచిస్తోంది. కూటమి నుండి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. వీరిలో గెలుపుపై ఆసక్తి నెలకొంది.
అనంత జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను కలెక్టర్ ఎం.గౌతమి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో విడపనకల్లు మండలం హవళిగి గ్రామ వాలంటీర్ కొల్లారప్ప , ఫీల్డ్ అసిస్టెంట్ కె.మల్లికార్జున, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ వాలంటీర్లు ప్రవీణ్, ప్రకాష్, తాడిపత్రి మండలం ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ పావురాల శీనయ్య ఉన్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్, లైటింగ్, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచమన్నారు.
వైసీపీలో పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, శింగనబంద సర్పంచ్ గాడు వెంకటనారాయణను సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఆదివారం వారు మాట్లాడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.