India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల పట్టణంలోని గుంటూరు రహదారిలో గల ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన సదరు వ్యక్తి చంద్రబాబు సభకు వెళుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు.
తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన యాకోబు (55) అనే వ్యక్తి మృతి చెందినట్లుగా విసన్నపేట పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఆదివారం ఉదయం స్థానిక ఏ.వేమవరప్పాడుకు ప్రభాకర్ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. అయితే సాయంత్రానికి వారు వైసీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ఇష్టం లేని పార్టీలో తాము ఉండలేమంటూ వైసీపీలో చేరారు. జడ్పీటీసీ పందిరి హరి, సర్పంచ్ విజయ సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి విశ్వరూప్ విజయానికి కృషి చేస్తామన్నారు.
టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఇవాళ మధ్యాహ్నం చనిపోయిన విషయం తెలిసిందే. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని అచ్చెన్న నివాసానికి కింజరాపు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ, గౌతు శిరీష తదితర టీడీపీ నేతలు కళావతమ్మ భౌతికదేహానికి నివాళులార్పించారు. కింజరాపు సోదరులను పరామర్శించారు.
అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో తూ.గో. జిల్లా వాసి మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఆదివారం సెలవు కావడంతో రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వెళ్లారు. వారిలో కొండయ్య(33) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. దీంతో స్నేహితులు హుటాహుటిన బయటకు తీసి మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన బెజవాడ గోపాల రెడ్డి మద్రాసు రాష్ట్రంలోనే మంత్రిగా పని చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో 1955లో ఆయన CMగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17న CMగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం 297 రోజులు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
#ELECTIONS2024
ప్రజల యాత్రలో భాగంగా ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల చేరుకున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తరలివచ్చారు. బాపట్లకు చేరుకున్న ఆయనకు బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు.
కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలిపారు. టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే 33 శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉంటూ ఓటు వేయలేని వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలపై అందరి దృష్టి నెలకొంది. YCPలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. తరచూ కుప్పంలో పర్యటిస్తూ బాబుకు సవాల్ విసురుతున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ కావడంతో పెద్దిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.