India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం అసెంబ్లీ టికెట్ రాలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మారుతున్నారని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. అనంతపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సమస్యను అధినేత చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు.
అభిమానాన్ని పెళ్లి కార్డుల రూపంలో చూపుడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ప.గో జిల్లా ఆచంటలో ఓ యువకుడు TDPపై అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ‘ఓట్ ఫర్ టీడీపీ’ అంటూ ఆచంట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటోలు ముద్రించుకున్నాడు. కార్డు వెనుక వైపు ‘మన ఆచంట- మన పితాని’ అని రాసి ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేనానికి శ్రీ వల్లభ సంస్థానం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు పవన్‌తో పూజలు చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2వ రోజు ప్రచారంలో భాగంగా పవన్ బయలుదేరగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారికి పవన్ అభివాదం చేశారు.
మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన పుల్లారావు(21)అనే యువకుడు శ్రమల దినాలలో జపమాల ఆచరించి యోగేశ్వరం పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు తోటి జపమాల దారులతో కలిసి వెళ్లాడు. అక్కడ పుల్లారావు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుని పోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని మృతదేహాన్ని అదివారం తన గ్రామానికి తరలించారు.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కూటమి అభ్యర్థులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి.. ఆయన బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి మద్దతు పలకాలని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఉమ్మడి కడప జిల్లాలో TDP వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు సీటు దక్కని నేతలు బహిర్గతంగానే పార్టీపై విమర్శలు చేశారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు నాయకులు ఆ కోవలోనే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు వారు ఎంతవరకు సహకరిస్తారో అని చర్చ ఉంది. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టింది.
తాడేపల్లి మండలం కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సమావేశమయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్ఠం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులైన ఓటర్లు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఓటు హక్కు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ హెల్ప్ లైన్ డెస్క్, బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ షీట్, సహాయకుడిని అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ విధానంపై రూపొందించిన సాక్ష్యం యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.
మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిని పెనుగంచిప్రోలు మండలం కొనకంచికి చెందిన సతీశ్‌తో గత ఏడాది వివాహం చేశారు. శ్రీలక్ష్మికి 2సార్లు గర్భస్రావం కావడంతో భవిష్యత్తులో పిల్లలు పుట్టరని భర్త, అత్తమామలు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.