Andhra Pradesh

News March 31, 2024

అనకాపల్లి ఎంపీకి కీలక బాధ్యతలు

image

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్‌గా స్థానిక ఎంపీ బి.వి సత్యవతి నియమితులయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ సూచించింది. కాగా.. ఈసారి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడికి అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 

News March 31, 2024

RRR పోటీపై సందిగ్ధత.. క్యాడర్‌లోనూ క్లారిటీ మిస్!

image

MP రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప.గో జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ BJP అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ RRR మాత్రం తానే బరిలో ఉంటానని, ఇక్కడ MPగా కాకుంటే ప.గోలోనే MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. అటు BJP నేతలు వర్మనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో RRR వర్గంతో పాటు కూటమి క్యాడర్‌లోనూ క్లారిటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

News March 31, 2024

ప.గో జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న RRR సీటు!

image

నరసాపురం సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు పోటీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన పలుమార్లు అన్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం శ్రీనివాసవర్మ పేరు ప్రకటించింది. దీంతో RRR కేడర్ సందిగ్ధంలో పడింది. అయితే.. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నరసాపురం MPగా కాకుంటే ప.గో జిల్లాలో MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో జిల్లాలో RRR సీటు పొలిటికల్ హీట్ పెంచుతోంది.

News March 31, 2024

గుంటూరు: టీడీపీలోకి ఎమ్మెల్సీ జంగా

image

జిల్లాలో రాజకీయ సమీకరణ చేరనున్న ఎమ్మెల్సీలు మారుతున్నాయి. వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు గురజాల నియోజకవర్గంలోని పలువురు నేతలు వైసీపీని వీడి జంగాతో టీడీపీలో చేరనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం జరగనున్న పర్యటనలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

News March 31, 2024

జిల్లా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ 

image

కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు పునరుద్ధానం పొందిన పర్వదినం ఈస్టర్ అన్నారు. అటువంటి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. 

News March 31, 2024

కడపలో పాగా వేసేది ఎవరు.?

image

జిల్లా రాజకీయాల్లో కడప అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 3 దశాబ్దాల నుంచి ముస్లింలకు కంచుకోటగా మారిన కడప నుంచి సిట్టింగ్ MLA అంజాద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇటు కూటమి నుంచి మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. కడపలో గెలిచి చరిత్ర సృష్టిస్తానని మాధవిరెడ్డి అంటుంటే, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిది.?

News March 31, 2024

నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు

image

నెల్లూరు నగరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2024 -25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతిలో 64 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సీట్ల కోసం ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.

News March 31, 2024

వరదయ్యపాలెం: ఈతకు చెరువులో దిగి వివాహిత మృతి

image

కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు చెరువులో దిగిన ఓ గిరిజన వివాహిత నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటన వరదయ్యపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పవన్, నాగరాణి దంపతులు శుక్రవారం సాయంత్రం కాలనీ సమీపంలోని చెరువులో సరదాగా ఈత కోసం దిగారు. భర్త పవన్ చెరువు ఒడ్డున దుస్తులు ఆరబెడుతుండగా.. ఈత రాకపోవడంతో నాగరాణి(40) నీట మునిగి శవమై తేలింది. వీరికి నలుగురు సంతానం. ఘటన పై కేసు నమోదు చేశారు.

News March 31, 2024

విశాఖ: ‘బాలుడు కరోనాతో చనిపోలేదు’

image

కేజీహెచ్‌లో కరోనాతో బాలుడు చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. రెండు వారాలుగా మలేరియా పచ్చకామెర్లతో బాలుడు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తూ.గో జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని ఈనెల 28న కేజీహెచ్‌‌లో చేర్పించినట్లు తెలిపారు. అప్పటికే బాలుడు కీళ్ల వ్యాధికి స్టెరాయిడ్ థెరపి తీసుకుంటున్నట్లు చెప్పారు. పైవ్యాధులతో బాలుడు చికిత్స పొందుతూ 29న మృతి చెందాడన్నారు.

News March 31, 2024

VZM: లవ్ ఫెల్యూర్.. యువకుడు మృతి

image

ప్రేమించిన యువతి మోసం చేసిందని దివ్యాంగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. భోగాపురం మండలం కంచేరుకు చెందిన యువకుడిని ఓ యువతి మోసం చేసిందనే మనస్థాపంతో పురుగుమందు తాగాడు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు.