Andhra Pradesh

News March 31, 2024

కృష్ణా: APSDMA నుంచి ప్రజలకు ముఖ్యమైన గమనిక

image

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కృష్ణా జిల్లాలో ఆదివారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు డిగ్రీలు, సెంటీగ్రేడ్‌లలో నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40
☞ఉయ్యూరు 40
☞బాపులపాడు 40.1
☞గుడివాడ 39.2
☞గన్నవరం 40.3
☞పెనమలూరు 40.1
☞ఉంగుటూరు 40.3
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.5
☞పామర్రు 38.7

News March 31, 2024

మదనపల్లిలో రైతును కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్

image

మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం జరగడం తీవ్రకలకలం రేపుతోంది. పోలీసుల కథనం.. మండలంలోని పాలెంకొండకు చెందిన నాగరాజకు , అదే ఊరిలోని చిన్నప్పకు ఆస్తికోసం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం పొలం వద్ద ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈఘర్షణలో రైతు నాగరాజపై ప్రత్యర్థులు మురళి, చిన్నప్ప, చిన్నక్కలు కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్ అయ్యాయి, తలకు గాయమైంది. బాధితునికి మదనపల్లెలో చికిత్స చేయించి రుయాకు వెళ్లారు.

News March 31, 2024

వజ్రకరూర్ మండలంలో రేషన్ డీలర్ సస్పెన్షన్

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిపారు.

News March 31, 2024

నేడు బాపట్లకు రానున్న చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం బాపట్ల పట్టణానికి వస్తున్నారు. మార్కాపురం నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల నుంచి సాయంత్రం 5.40 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అంబేడ్కర్ విగ్రహ కూడలిలో రాత్రి 6 గంటలకు ప్రచార సభలో ప్రసంగిస్తారు. రాత్రి బాపట్లలోనే చంద్రబాబు బస చేస్తారు.

News March 31, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం మదుపాడ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు (40) మృతి చెందినట్లు ఎస్.ఐ మహేష్ తెలిపారు. రామారావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతనిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు.

News March 31, 2024

కోవూరు :రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోవూరు మండలంలోని పడుగుపాడు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి సుమారు 55 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది.కావలి జీఆర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడి చొక్కాపై విజయలక్ష్మి టైలర్,గాంధీపార్కు,కోవూరు అని రాసి ఉందని,స్థానికుడిగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

News March 31, 2024

ఎన్టీఆర్ జిల్లాలో రూ.16.10లక్షల నగదు, బంగారం పట్టివేత

image

ఎన్నికలో నేపథ్యంలో జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. CP కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. పశ్చిమ DCP పరిధిలో ప్రకాశం బ్యారేజ్, గుంటుపల్లి, పాముల కాలువ, నున్న పవర్ గ్రిడ్ ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో రూ.5.55లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1టౌన్ స్టేషన్ పరిధిలో రూ.10.55లక్షల నగదు, 79.1గ్రాముల గోల్డ్ పట్టుకుని ఎన్నికల అధికారులకు అందిచామన్నారు.

News March 31, 2024

శ్రీకాకుళం: పెరగనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాల్లో వడగాలులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వ హణ కేంద్రం ప్రకటించింది. ‘సోమవారం ఒక మండలంలో తీవ్ర, మరికొన్ని మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీయనున్నాయి. శనివారం అత్యధికంగా నంద్యాల జిల్లా అవుకులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News March 31, 2024

నెల్లూరు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

image

నెల్లూరు ఆనం కార్యాలయంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూప చారి, విద్యార్ది విభాగానికి,  వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం. రామనారాయణ రెడ్డి, యువనేత ఆనం రంగమయూర్ రెడ్డితోనే మా ప్రయాణమని అన్నారు. టీడీపీతో కలిసి పనిచేయటానికి, మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావటానికి కృషి చేస్తానని అన్నారు.

News March 31, 2024

గిద్దలూరులో గెలుపు ఎవరిది?

image

గిద్దలూరు ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో 12 వేలకు వైగా ఓట్లతో గెలిచారు. అటు వైసీపీ నుంచి మార్కాపురం MLA కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు బరిలో ఉన్నారు. స్థానికులకే పట్టం కట్టాలని టీడీపీ ప్రచారం చేస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని కేపీ అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు.