India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎడ్ (B.Ed), బిఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులో ఖాళీగా ఉన్న 51 సీట్లుకు, ఏప్రిల్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని పేర్కొన్నారు. APED CET- 2023 అర్హత పొంది ఏ కళాశాలలో అడ్మిషన్ పొందనివారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
వేసవి వేడి గాలుల తీవ్రత పెరిగే సూచనల దృష్ట్యా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను తెరవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలసి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. వడగాలుల కారణంగా జిల్లాలో ఎవరూ మృతి చెందకుండా చూడటమే లక్ష్యమన్నారు.
పిఠాపురం నుండి MLA అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్‌ని ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు.
కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన కట్ట సుబ్బారావు (24) తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్‌కి వీడియో పంపాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో కారంచేడు పోలీస్ సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా బాధితుడిని గుర్తించి బంధువులకు అప్పగించారు.
సంక్షేమ పథకాల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్‌తో కేసు వేయించి ఆపివేయించారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం రాత్రి తణుకు మండలం మండపాకలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయించి కుట్ర చేశారని ఆరోపించారు.
ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు భూపేశ్ రెడ్డి గురించి మాట్లాడారు. ‘బుల్లెట్ లాంటి కుర్రాడు, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, జమ్మలమడుగు TDPకి ఎవరూ లేనప్పుడు పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. పార్టీని నమ్ముకున్నాడు కాబట్టే MP టికెట్ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. భూపేశ్‌కు ప్రత్యర్థిగా వివేకాను హత్య చేసిన వ్యక్తి ఉన్నాడని ఆరోపించారు. భూపేశ్‌ని గెలిపిస్తే కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుందని హామీ ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో మాజీ సీయం కిరణ్ కూమార్ రెడ్డి సోదరుడు, పీలేరు టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లారి కిషోర్ రెడ్డితో వేదికను పది సంవత్సరాల తర్వాత పంచుకున్నారు. బీజేపీ కార్యాలయంలో కలిసిన అనంతరం సొంత ఇంటికి వెళ్లడంతో వారి అనుచరులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా కిరణ్ కూమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా విజయవాడకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు, ఒక డాక్టర్ కమ్ సెక్సాలజిస్ట్‌ను స్టార్ క్యాంపెయినర్లుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంపిక చేసింది. చదరంగంలో విజయవాడ కీర్తిపతాకను ప్రపంచస్థాయిలో ఇనుమడింపచేసిన కోనేరు హంపి, ఆర్చరీలో ప్రపంచాన్నే శాసించిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రముఖ వైద్యుడు సెక్సాలజిస్ట్, సామాజికవేత్త డాక్టర్ జి. సమరంను ఎంపిక చేశారు.
ట్రాక్టర్ బోల్తా పడి లింగాలకు చెందిన జయరామిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈతాకుల కోసం ట్రాక్టర్‌లో వెళ్లాడు. తిరుగు పయణంలో అంబకపల్లి మురారిజింతల గ్రామ సరిహద్దుల్లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర విలపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.