India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ పి. రాజాబాబు పరిశీలించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌లో భద్రపర్చిన ఈవీఎంలను పరిశీలించిన ఆయన భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలన్నీ పటిష్టమైన భద్రతా చర్యల మధ్య భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఎలక్షన్ సెల్ అధికారులు ఉన్నారు.
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని కీలక సమావేశాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడారు.2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. కాగా బీజేపీ జాతీయ నేతలతో బొల్లినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా, 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
కంటైనర్ లారీ ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ రావు గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నారు. కొలనుకొండ సాయిబాబా మందిరం సమీపంలో లారీ వెనక నుండి ఢీకొట్టింది. మోహన్ రావు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్‌లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 9, జనసేన 3, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అధినేత పవన్ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
విజయనగరానికి చెందిన బీసీసీఐ స్కోరర్ తోట విజయ్‌ను మార్చి31, ఏప్రిల్ 3న విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా నియమించినట్లు ఏపీ క్రికెట్ సంఘం కార్యదర్శి గోపీనాథ్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా విజయ్ వ్యవహరించనున్నారు.
చల్లపల్లి మండలం పురిగడ్డ గ్రామంలో 30న పోతురాజు, గంగానమ్మ విగ్రహాల పునః ప్రతిష్ఠ వైభవంగా జరగనుంది. ప్రతిష్ఠ నిమిత్తం పోతురాజు శిలను శుభ్రం చేస్తుండగా ఆ శిల ప్రాచీన వైభవం బయటపడింది. పోతురాజు రూపంలో ఉన్న ఆ శిల 3వ శాతాబ్ధం నాటి ఇక్ష్వాకుల శిలాగా గుర్తించారు. ఈ శిలకు ఆనంద అనే బౌద్ధ గురువు విరాళం ఇచ్చినట్లు చెక్కి ఉందని బెంగళూరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసన విభగం డైరెక్టర్ మునిరత్నం చెప్పారు.
మడకశిర పట్టణం ఎగువ అచ్చంపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్(45) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన సోమశేఖర్ తాగుడుకు బానిసై, కుటుంబ పోషణ భారమై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.