Andhra Pradesh

News March 29, 2024

రాజంపేటలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

image

రాజంపేటలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేయడంపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేయడంతో పాటు పలువురు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇన్నిరోజులుగా పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో పట్టు తీసుకొచ్చిన భత్యాల చాంగల్రాయుడుకు సీటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో ఆయన అనుచరులు మండిపడ్డారు.

News March 29, 2024

దేవినేని ఉమాకు వసంత బర్త్‌డే విషెస్

image

మైలవరం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బర్త్ డే విషెస్ తెలిపారు. మైలవరం టికెట్ ఉమా ఆశించగా.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంతకే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఎదురుపడిన దాఖలాలు లేవు. ఈక్రమంలో ఉమాకు వసంత విషెస్ చెప్పడం గమనార్హం.

News March 29, 2024

VZM: కేబీఆర్ భవిష్యత్ కార్యాచరణపై నేడు కీలక ప్రకటన

image

నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన అనుచరులతో ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గ టికెట్‌ను ఆయన ఆశించగా పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. భీమిలి ఎమ్మెల్యే టికెట్ లేదా విజయనగరం ఎంపీ టికెట్‌ను కేటాయిస్తారని ఆశతో ఎదురుచూసినప్పటికీ ప్రకటించకపోవడంతో అత్యవసర సమావేశానికి తన అనుచరులకు పిలుపునిచ్చారు.

News March 29, 2024

కావలికి చేరుకున్న చంద్రబాబు

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

News March 29, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట

image

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

News March 29, 2024

ఎచ్చెర్ల TO విజయనగరం

image

ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎచ్చెర్ల MLA టికెట్ ఆశించిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుకు ఆ పార్టీ విజయనగరంలో అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీగా కలిశెట్టి, చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా పోటీ చేయనున్నారు. ఇన్ని రోజులు ఎచ్చెర్ల స్థానం కోసం వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. మరి ఆ ఇద్దరూ అక్కడ ఎలా వ్యహరిస్తారో చూడాలి మరి.

News March 29, 2024

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం

image

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట TDP ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేయగా.. ఇందులో  రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రకటించింది. రాజంపేట వైసీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న బత్యాలకు భంగపాటు ఏర్పడింది.

News March 29, 2024

గంటా రాజకీయ ప్రస్థానం

image

భీమిలి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన గంటా శ్రీనివాసరావుకు ఓటమి ఎరుగని నేతగా పేరుంది. 1999 ఆయన అనకాపల్లి నుంచి మొదటిసారిగా టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. 2014లో మళ్లీ టీడీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

News March 29, 2024

క్రైస్తవులకు బోడే క్షమాపణ చెప్పాలి: మంత్రి జోగి రమేశ్

image

పెనమలూరులో నేడు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని క్రైస్తవ మందిరాల్లో ప్రార్థనలునిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బోడె ప్రసాద్ బూట్లు వేసుకొని సిలువ మోయడం క్రైస్తవులకు అవమానించడమేనన్నారు. ఆయన వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News March 29, 2024

కడప కూటమి ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి

image

తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భూపేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో భూపేశ్‌కు కడప ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. భూపేశ్ విజయానికి కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు పని చేయాలని సూచించారు.