Andhra Pradesh

News March 29, 2024

కర్నూలు: ఎన్నికల ఉల్లంఘనలపై కొరడా.. విధుల నుంచి తొలగింపు

image

సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 95 ఫిర్యాదులు రాగా అందులో 65 సహేతుకమైన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సృజన చెప్పారు. 53 ఫిర్యాదులను నిర్దేశించిన 100 నిమిషాల్లో పరిష్కరించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 20మంది వాలంటీర్లు, డీఆర్ డీఏ-వైకేపీ ఆర్పీ ఒకరు, నగరపాలక సంస్థ డ్రైవర్ (ఆప్కాస్) ఒకరు, హెచ్. కైరవాడి సహకార సొసైటీ అటెండర్ ఒకరు కలిపి 23మంది తొలగించామన్నారు

News March 29, 2024

ఆలూరు టికెట్ కేటాయించిన చంద్రబాబు.. వీడిన ఉత్కంఠ

image

ఆలూరు TDP MLA టికెట్ వీరభద్ర గౌడ్‌కు టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అటు ఇటీవలే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా.. ఆదోనికి కూటమిలో భాగంగా BJP అభ్యర్థి పార్థసారథిని ప్రకటించారు.

News March 29, 2024

దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి

image

దర్శి సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని చాలా రోజులు అటు ప్రజల్లో, ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ దర్శి కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారయింది. ఈమె మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. దర్శి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటివరకు అనేకమంది పేర్లు ప్రచారం పొందగా నేటితో ఆ ఉత్కంఠకు తెరపడింది.

News March 29, 2024

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

image

కూటమి చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంటకరావును, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. వీరిద్దరూ ఆశించిన ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయించారు. కాగా.. చీపురుపల్లిలో పోటీ చేస్తారన్న గంటాకు భీమిలి సీటు కేటాయించింది. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కిమిడి నాగార్జునకు కళా స్వయానా పెదనాన్న అవుతారు.

News March 29, 2024

అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ

image

అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈయనకు బోయ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. హిందూపురం పార్లమెంట్ స్థానం ఆశించారు, కానీ టీడీపీ అధిష్ఠానం అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది.

News March 29, 2024

గుంతకల్లుకు గుమ్మనూరు.. అనంత అర్బన్‌కు వెంకటేశ్వర ప్రసాద్

image

గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం గుమ్మనూరు జయరాంను ఖరారు చేసింది. ఆలూరుకి చెందిన జయరాం వైసీపీ నుండి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరగా.. ఎట్టకేలకు ఆయన పోటీచేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. అటు కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ భార్య కాకుండా ప్రసాద్ బరిలో ఉంటారని ప్రకటించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉంటారని టీడీపీ తుది జాబితాలో పేర్కొంది.

News March 29, 2024

ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు సీటు ఖరారు

image

ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.

News March 29, 2024

NLR: జాతీయ రహదారిపై ప్రమాదం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో అమరావతి హోటల్ వద్ద జాతీయ రహదారిపై బస్సు, కారు, మరో వాహనం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

టీడీపీలో చేరిన మల్లెల రాజేశ్ నాయుడు

image

కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి  నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.

News March 29, 2024

టీడీపీలోకి మల్లెల రాజేశ్ నాయుడు.?

image

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.