Andhra Pradesh

News September 22, 2025

కర్నూలు జిల్లా ఎస్పీ పబ్లిక్ గ్రీవెన్స్‌లో 65 ఫిర్యాదులు

image

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా విని పరిష్కార చర్యలకు ఆదేశించారు. మోసాలు, ఉద్యోగ మభ్యపాటు, అప్పుల వేధింపులు, స్కూల్‌లో ఘర్షణలు, భూ ఆక్రమణలు, పొదుపు గ్రూపుల మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.

News September 22, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీల స్వీకరణ

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News September 22, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఈ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 22, 2025

కొనకనమిట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ లారీ ఢీకొన్నాయి. అయితే బైకర్ తలపైకి లారీ ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పొదిలికి చెందిన శ్రీనివాసులుగా పోలీసులకు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 22, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కలెక్టర్

image

జవాబుదారీతనంతో పౌర సేవలు అందించే క్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఆమె ప్రజల నుంచి 178 అర్జీలు స్వీకరించారు. అర్హత కలిగిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News September 22, 2025

ఎమ్మిగనూరు: పెన్షన్ ఇచ్చి మమ్మల్ని బ్రతికించండి అయ్యా.!

image

మండల పరిధిలోని దైవందీన్నేలో సంవత్సరం క్రితం తన తండ్రి మరణించాడని, తల్లికి పింఛన్ ఇవ్వాలని 14 సం. సంకటి ప్రసన్న ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ కూడా పక్షవాతంతో కొట్టుమిట్టలాడుతుందని, తమకు ఆస్తిపాస్తులు ఏమీ లేవని వాపోయాడు. ఆమ్మకు కావాల్సిన మందుల కోసం చదువు మానేసి కూలి పనులు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి బాలుడి అమ్మకు చికిత్స అందించి, పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు.

News September 22, 2025

540 అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

image

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News September 22, 2025

నెల్లూరు: మద్దతు ధర లేక రైతుల కష్టాలు!

image

జిల్లాలోని వరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మిల్లర్లు, దళారులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా, పుట్టి రూ.15 వేలకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.16,520 నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా ధాన్యం రంగు మారిందని సాకుతో రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా జోక్యం చేసుకోవాలంటున్నారు.

News September 22, 2025

నెల్లూరు: మా ధాన్యం కొనేదెవరు మహాప్రభో…!

image

పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, గిట్టుబాటు ధర అందక రైతులు లబో.. దిబోమంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు ధరను ప్రకటించినా ఆ ధరకు ఎవరూ కొనడంలేదని వాపోతున్నారు. ధాన్యాన్ని దాచుకోవడానికి గోడౌన్లు లేవని ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయని, ఇదే అదునుగా దళారులు అతి తక్కువ ధరకు అడుగుతున్నారని, తమకు గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నారు.