India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాలలో డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి విడుదల చేశారు. 5వ సెమిస్టర్‌లో 1,261 మందికి గాను 862 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆర్ట్స్‌లో 60 శాతం, కామర్స్‌లో 74 శాతం, సైన్స్‌లో 71 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 3వ సెమిస్టర్‌లో 855 మందికి గాను 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్‌లో 1,028 గాను 657 మంది పాసైనట్లు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అందులో తాడిపత్రిలో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. గుంతకల్ 41.2 శింగనమల41.1, పరిగి 40.9 శెట్టూరు 40.8, గుత్తి, చెన్నేకొత్త పల్లి, కనగానపల్లి 40.7, ధర్మవరం 40.6 నమోదైనట్లు తెలిపారు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు అంతర్జాతీయ, రెండు దేశీయ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి విశాఖ బ్యాంక్, 26 నుంచి కౌలాలంపూర్ విశాఖ, మార్చి 31 నుంచి విశాఖ ఢిల్లీ, విశాఖ హైదరాబాద్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఆయా సర్వీసులకు సంబంధించి టికెట్లు ప్రస్తుతం ఆల్ లైన్ లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది.
2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టిఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.
మీకు తెలుసా.. శ్రీకాకుళం జిల్లాలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి 81 ఓట్లు అత్యంత తక్కువ మెజార్టీతో పెంటన్నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి పెంటన్నాయుడు పోటీ చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి ఎంఎస్ నారాయణపై 81 ఓట్లతో గెలిచారు. ఇప్పటి వరకు అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి జిల్లాలో లేరు.
కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 28వ తేదీ వరకు పని దినాలుగా నిర్ణయించడంతో నేటి నుంచి జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి.
Sorry, no posts matched your criteria.