Andhra Pradesh

News March 28, 2024

సీతారామపురంలో విజయసాయిరెడ్డి రోడ్ షో

image

ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురంలో గురువారం వైసీపీ అభ్యర్థులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వేణుంబాక విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఎల్.వీ.ఆర్ కళాశాల వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. వైసీపీని వాడుకుని వదిలేసిన నాయకులకు ఘన విజయంతో గుణపాఠం చెప్పాలని విజయసాయి రెడ్డి కోరారు.

News March 28, 2024

పేరూరు చెరువుకు నీరిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

image

రాప్తాడు నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూ మాఫియాలతో కుతకుతలాడిపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాప్తాడు సభలో ఆయన మాట్లాడుతూ.. పేరూరు చెరువుకు నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో రైతులకు న్యాయం చేస్తామన్నారు.

News March 28, 2024

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా హిజ్రా  

image

సామాజిక న్యాయం కోసం ఏపీలో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజ్ వాదీ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా హిజ్రా సూరాడ ఎల్లాజీని ప్రకటించామన్నారు. హిజ్రాకు టికెట్ ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని, సామాజిక న్యాయం కోసం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

News March 28, 2024

నెల్లూరు: మాజీ MLAని YCPలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్యాంప్ సైట్ లో ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగాయి. వైసీపీలో చేరాలని విష్ణును జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని విష్ణు స్పష్టం చేశారు. విష్ణు తీసుకునే నిర్ణయం కోసం ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది.

News March 28, 2024

శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ గురువారం పరిశీలించారు. ట్రైనింగ్ కు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని R.O, ARO లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News March 28, 2024

కన్వర్జెన్సీ పనులపై దృష్టి సారించండి: కలెక్టర్

image

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ పనులుపై పీఓ, ఎపీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
ఎన్ఆర్‌ఈజీఎస్‌పై సిబ్బందితో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. వేతనాలు అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.

News March 28, 2024

రాప్తాడు: రాయలసీమ ద్రోహి జగన్: చంద్రబాబు

image

రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను సీమకు నీళ్లు తెస్తే.. సీఎం జగన్ రాజకీయ హింస తెచ్చాడు అని విమర్శించారు.

News March 28, 2024

పోతిన మహేశ్ దారెటు..?

image

జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పోతిన మహేశ్ వెనక్కి తగ్గడం లేదు. న్యాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుజ్జగించినా వినే పరిస్థితి కనపడంలేదు. పార్టీ గీత దాటితే సహించేది లేదని ఇప్పటికే పవన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి మహేశ్ ఏమి చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహేశ్ సర్దుకుంటారా.. మరేదైనా నిర్ణయం తీసుకుంటారా వేచి చూడాలి.    

News March 28, 2024

కడప టీడీపీ MP అభ్యర్థిగా వారిలో ఎవరు .?

image

రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప MP అభ్యర్థిగా ఎవర్ని నియమించాలని అధిష్ఠానం మల్లగుళ్ళాలు పడుతుంది. రోజుకో కొత్త పేరుతో ఆసక్తి రేపుతోంది. వీరశివారెడ్డి, భూపేశ్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, ఉక్కు ప్రవీణ్, వాసు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు ఐవీఆర్ సర్వే ద్వారా వీరి పేర్లతో ఫోన్లు చేస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

News March 28, 2024

HM.పాడు: కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి

image

హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురంలో గురువారం కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి చెందాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన తెల్లయ్య, గురవయ్యకి సంబంధించిన గొర్రె పిల్లలను దొడ్లో కట్టేశాడు. కుక్కల మంద వచ్చి దాడి చేయడంతో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయని వారు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.