India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని పి.రాజవరంలో బుధవారం రాత్రి పొగాకు రైతు రామ్మోహన్ రెడ్డి పై కూరగాయలు కోసే కత్తితో నాగేంద్ర బాబు అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపించారు. పొగాకు ఉడికించే విషయంలో రైతు, కూలీ మధ్య చిన్నపాటి ఘర్షణ దాడికి దారి తీసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం రాలేదు. సీవీ శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 2వసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోమారు కాకాణి, సోమిరెడ్డి ముఖాముఖి తలపడబోతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా మూడో ఛాన్స్ కొట్టేసినట్టే .
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లె జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో వెహికల్ బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉండగా, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
బిట్రగుంట – విజయవాడ, బిట్రగుంట – చెన్నై మధ్య నడిచే మెమూ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు రైళ్లను ఇప్పటికే పునరుద్ధరణ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే అభివృద్ధి కమిటీకి కూడా సమాచారం పంపారు.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన నేరస్థుడిపై పోలీసులు PDయాక్ట్ అమలు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం కొండూరి మణికంఠ అలియాస్ KTM పండు(26) పెనమలూరు మండలం కానూరులోని సనత్‌నగర్ వాసి, హత్యలు, నేరాలకు అలాటుపడి శాంతి బద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. అతని నేర నివేదిక మేజిస్ట్రేట్‌కి సమర్పించగా రాజమండ్రి కారాగారంలో నిర్భంధంలో ఉంచాలని ఉత్తర్వులిచ్చారన్నారు.
నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
బాపట్ల నియోజకవర్గంలో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. 1999లో చివరిగా టీడీపీ నుంచి మంతెన అనంతవర్మ గెలుపొందారు. అప్పటి నుంచి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
Sorry, no posts matched your criteria.