India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.55 మదనపల్లి నుంచి హెలికాప్టర్‌లో 10.40 ప్రసన్నాయ పల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి 11 నుంచి12.30 వరకు రాప్తాడు బహిరంగసభలో పాల్గొంటారు. 2 గంటల వరకు ఆర్డీటీ స్టేడియంలో భోజన విరామం. 2.30 నుంచి 4 వరకు బుక్కరాయసముద్రం మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడనుంచి కదిరికి 5.10 చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలను తరలిస్తున్న అయిదుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో కారులో ఆరు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ప్రయాణికుల రాకపోకలను సాగించిన ఎయిర్‌పోర్టుగా రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాదిలో
ఇప్పటి వరకు 29 లక్షల మంది రాకపోకలతో ఈ రికార్డును సృష్టించింది. ఇంత వరకు 2018లో 28.54 లక్షల మంది ప్రయాణించడమే అత్యధికంమని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని 3.6 మిలియన్లకు పెంచారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.
దర్శి టికెట్‌పై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, రోజుకో కొత్త పేరు వినపడుతోంది. టీడీపీ నుంచి గోరంట్ల రవికుమార్, మాజీ MLA గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. బాచిన కృష్ణచైతన్య, మాగుంట రాఘవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు.
పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది. పట్టణంలోని నవిరికాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈనెల 25న కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఫిర్యాదు అందిందని ఎన్నికల అధికారిని కే.హేమలత తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ అనంతరం టీడీపీ అభ్యర్థి విజయచంద్రతోపాటు మరో పదిమందిపై పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
కైకలూరు, విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థులను నిన్న ప్రకటించారు. దీంతో ఉమ్మడి కృష్ణాలోని 16 సీట్లలో 15 మంది అభ్యర్థులెవరో తెలిసిపోయింది. జనసేనకు కేటాయించిన అవనిగడ్డ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. వంగవీటి రాధ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నా ఫైనల్ కాలేదు. మరోవైపు మండలి బుద్ధప్రసాద్ వర్గం TDPకే టికెట్ ఇవ్వాలని నిరసన తెలుపుతోంది. ఈ క్రమంలో అవనిగడ్డ టికెట్ ఎవరికిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం గవరంపేట, చింతలబెలగాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపైకి రావడంతో వాహన చోదకులు భీతిల్లిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారిపై రెండుసార్లు ఏనుగుల గుంపు రావడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపైకి ఏనుగులు వచ్చిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వచ్చి వాటిని సమీప పంట పొలాల్లోకి తరలించారు.
Sorry, no posts matched your criteria.