India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ కూటమిలో భాగంగా విశాఖ నార్త్ సీటుకి విష్ణుకుమార్ రాజు పేరును ప్రకటించింది. ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందగా, 2019లో ఓడిపోయారు. 2014లో 18,240 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియెజకవర్గంలో నమోదు అయిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిలో భాగంగా మరోసారి బరిలో నిలుస్తున్నారు.
ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే రాజకీయ నాయకులు తప్పకుండా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పార్టీ అభ్యర్థులు సమావేశాలు మొదలైనవాటిని నిర్వహించడానికి 48గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగియడానికి 48గంటల ముందు నిశ్శబ్ద కాలం తప్పక పాటించాలని, దీనినే ఎన్నికల ముందు నిశ్శబ్దం అని పిలుస్తారని అన్నారు.
విజయవాడ వెస్ట్ టికెట్‌పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. బుధవారం బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ ఖరారు చేశారు. దీంతో నియోజక వర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావును (ఎన్ఈఆర్) బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన ఈయన తొలిసారిగా 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తరువాత.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పట్ల ఆకర్షితుడైన ఎన్ఈఆర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణ రెడ్డికి టికెట్ లభించింది. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలోకి చేరారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూపేశ్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఎన్నికల నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించుట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం చేయరాదన్నారు.
సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈక్రమంలో విజయమ్మ సీఎం జగన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వివాదాస్పదంగా స్పందించారు. ‘చెల్లిని ఏమీ చేయవద్దు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగవలసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. రాజశేఖర్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. లక్ష్మణరావుతోపాటు అధ్యాపక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలబస్ పూర్తికాని దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ప్రవేటు భవనాలపై వాల్ పేయింటింగ్‌కు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచే స్వీప్ కార్యక్రమాల నివేదిక తయారు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.