Andhra Pradesh

News March 27, 2024

సింహాచలం: యజ్ఞంలో పాల్గొన్న పీఠాధిపతులు

image

సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.

News March 27, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో 100శాతం ప్రసవాలకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసూతి మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. 6ప్రసూతి మరణాలకు సంబంధించి విచారణ చేపట్టారు. 

News March 27, 2024

VZM: ‘ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు తొలగించాలి’

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈఓ ముఖేశ్ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

News March 27, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

image

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.

News March 27, 2024

కడప: ప్రేమ పెళ్లి ..విషాదంతో ముగిసింది

image

పెద్దల నెదిరించారు, పోలీసు కేసులు, ఛేజింగ్ చివరికి ఐదు నెలల క్రితం పుల్లంపేట మండలం దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన హరికృష్ణ, చిట్వేలి కేకే వడ్డిపల్లికి చెందిన శ్రీలేఖ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా గడుపుతున్న ఆ జంటపై విధి కన్నెర్ర చేసింది. రాజంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్సు హరికృష్ణ (21) మృతి చెందగా, శ్రీలేఖ గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

News March 27, 2024

కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ సీఎం మేనల్లుడు

image

డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మేనల్లుడు డి.రమేష్ బాబు వైసీపీని వీడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగతానని చెప్పారు.

News March 27, 2024

పెండింగ్‌లో ఉన్న ఫారంలను వేగంగా పరిష్కరించాలి: ముఖేశ్ కుమార్

image

పెండింగ్ లో ఉన్న ఫారం-7,8 లను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు.

News March 27, 2024

మైదుకూరు: గుండెపోటుతో మహిళ మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన షేక్ భాను(37) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మూడు రోజుల నుంచి తాగు నీటి ట్యాంకర్ రాకపోవడంతో పక్కన వీధిలో నీటి ట్యాంకర్ నుంచి అతి కష్టం మీద బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కోసం ఎక్కువ టెన్షన్ పడడం వల్లే గుండెపోటుకు గురైందని వాపోతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News March 27, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY

image

ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భానుడి ప్రతాపానికి మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఏల్చూరులోని ఓ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చేతిపంపు నుంచి జాలువారుతున్న నీటి బిందువులను ఓ కాకి గొంతు తడుపుకుటుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అలాగే పశువుల నీరు కోసం చేతిపంపు, బోర్లు వద్ద, ఇళ్లపైన తొట్టెలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

News March 27, 2024

విజయవాడ: కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స‌చివాల‌యం నుంచి బుధవారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని సీ విజిల్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు.