Andhra Pradesh

News March 27, 2024

బొత్సకు పోటీగా ఎవరు?

image

ఉమ్మడి విజయనరగం జిల్లాలో చీపురుపల్లి మినహా ఎన్డీఏ కూటమి మిగతా అభ్యర్థులు ప్రకటించింది. బొత్స సత్యనారాయణకు పోటీగా గంటా శ్రీనివాస్‌ను బరిలో దింపాలని టీడీపీ అధిష్ఠానం భావించినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మీసాల గీత పేరును అధిష్ఠానం పరిశీలించింది. అంతేకాక విజయనగరం ఎంపీ అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా గీత పేరును చేర్చింది. దీంతో చీపురుపల్లి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

News March 27, 2024

మచిలీపట్నం MP, అవనిగడ్డ MLA అభ్యర్థులు ఖరారు?

image

మచిలీపట్నం పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పార్టీ అధినేత పవన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పేరు కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. రేపు వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారైతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.

News March 27, 2024

౩వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ

image

పుట్టపర్తి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్‌ నెలలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియ 3వ తేదీ నుంచి ఉంటుంది. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని, దీంతో 1వ తేదీ కాకుండా 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వారిని చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 27, 2024

చిత్తూరు: 10th పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి మృతి

image

తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రమణ కొడుకు పి.చరణ్(16)ను పది పరీక్షలు రాయడానికి బైక్‌పై తీసుకెళ్తుండగా మరో బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

విశాఖ: 315 మందికి షోకాజ్ నోటీసులు

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరుకాని 315 మంది ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఇన్ ఛార్జ్, ఆర్.ఐ.ఓ మురళీకృష్ణ తెలిపారు. రోజుకు రూ.1000 చొప్పున కళాశాల యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని తెలిపారు. మూల్యాంకనానికి ప్రైవేట్ కార్పొరేట్, కళాశాలల అధ్యాపకులను వెళ్ళనీయకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News March 27, 2024

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా అజయ్ 

image

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గుంటూరులోని CPI కార్యాలయంలో కూటమి సభ్యులు సమావేశం నిర్వహించి అజయ్ కుమార్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, పేద, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

News March 27, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News March 27, 2024

ఏలూరు: వైసీపీలోకి గోపాల్ యాదవ్.. ప్రభావం చూపేనా..?

image

ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీలో చేరారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అవుతుందా..? వైసీపీకి కలిసివస్తుందా..? కామెంట్ చేయండి.

News March 27, 2024

ఏర్పేడు: లైంగిక వేధింపులు.. బెదిరింపులు

image

ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. CI. శ్రీరామశ్రీనివాస్ కథనం మేరకు.. మండలంలోని వికృతమాలకు చెందిన ఓ కుటుంబం నుంచి పుత్తూరు మండలంలోని వేణుగోపాలపురానికి చెందిన సురేంద్ర కొంతకాలం కిందట నగదు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించాలని మహిళ అడిగినందుకు ఇంట్లో భర్త లేని సమయంలో అశ్లీల చిత్రాలను చూపించి లైంగికంగా వేధిస్తున్నాడన్నారు.

News March 27, 2024

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవసేనమ్మ?

image

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర ఛైర్‌‌పర్సన్ పి.దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.