India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన ఘటన ఐరాల మండలంలో జరిగింది. నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన చలపతి కుమారుడు సంతోశ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుుతున్నాడు. అనారోగ్యంతో చలపతి మంగళవారం మృతి చెందాడు. ఒకపక్క తండ్రి మరణం.. మరోపక్క పరీక్ష. తండ్రి మరణాన్ని దిగమింగి ఉదయం జరిగిన జీవశాస్త్ర పరీక్షను రాసి అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
బాలల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు, సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఏటా క్రీడాశాఖ వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు శిబిరాలు ఉంటాయని ఆ శాఖ ఉమ్మడి జిల్లా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. 8 నుంచి 14 ఏళ్ల లోపున్న బాలబాలికలు ఈనెల 30వ తేదీలోగా వివరాలు అందజేయాలని కోరారు. శిబిరాల నిర్వహణకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాళెంలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 19న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్(27)ను తీసుకెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, కుటుంబ సభ్యుల వద్ద ఆరాతీశారు. గోపాల్‌ను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస గౌడ్ విచారణ చేపట్టారు.
లింక్ రైళ్లు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పలు రైళ్లను రీ షెడ్యూలు చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం త్రిపాఠి తెలిపారు. విశాఖ-బెనారస్ రైలు ఈనెల 27న తెల్లవారు జామున 4 గంటల 20 నిమిషాలకు బదులు ఉ.7 గంటల 10 నిమిషాలకు, విశాఖపట్నం-పాట్నా హోలీ ప్రత్యేక రైలు ఈనెల 27న ఉ.9.25 గంటలకు బదులు 11.30 గంటలకు వెళ్లేలా మార్పులు చేశామని తెలిపారు.
కడప జిల్లాలో 513, అన్నమయ్య జిల్లాలో 400 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్ విజయరావు తెలిపారు. అక్కడ ఆర్మూర్ రిజర్వుడ్ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రత్యేక రూటు ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఒక వాహనంతో పాటు ఐదుగురు సిబ్బంది ఉంటారని స్పష్టం చేశారు.
ఎంసీసీ బృందం అనుమతి లేకుండా కరపత్రాలు, బ్యానర్లను ముద్రిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ సృజన ప్రింటర్లను హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ముద్రణ కోసం వచ్చే వ్యక్తి, అతనితో పాటు మరో ఇద్దరి సంతకాలు తీసుకోవాలని, వారికి ఎన్ని కాపీలు కావాలనే వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించి, అనుమతి ఇచ్చిన తరువాతే ముద్రించాలన్నారు.
అనంతపురం జిల్లాలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు 3,074 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ తెలిపారు. మొత్తం 31,330 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 30,944 మంది, 5,057 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 2,369 మంది హాజరయ్యారని తెలిపారు.
తాను అందించిన సేవలను అధిష్ఠానం గుర్తించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిందని ప్రవాసాంధ్రుడు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అభినందించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
ఎన్నికల సమయంలో ప్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.