Andhra Pradesh

News March 26, 2024

హంద్రీనీవాను పరిశీలించిన చంద్రబాబు

image

రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.

News March 26, 2024

అందరితో సంప్రదించాకే నిర్ణయం: ఎమ్మెల్సీ జంగా

image

అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

News March 26, 2024

ఎద్దుల బండి గుర్తుతో కంభం సంచలనం

image

ఉదయగిరిలో 1994 ఎన్నికల ప్రత్యేకతే వేరు. కంభం విజయరామి రెడ్డి టీడీపీ సీటు రేసులో ఉండగా అనూహ్యంగా కొండపల్లి గురవయ్య నాయుడు బీఫామ్ దక్కించుకున్నారు. చివరిలో మళ్లీ టీడీపీ అధిష్ఠానం కంభంకే మద్దతు పలికింది. అప్పటికే సమయం మించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎద్దుల బండి గుర్తుతో పోటీ చేశారు. 61 శాతం ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై కంభం సంచలనం సృష్టించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాం నిలిచారు.

News March 26, 2024

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీ గూటికి చేరారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకోటయ్య 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి 5,143 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ అప్పారావుపై గెలిచారు.

News March 26, 2024

ఏలూరు: వైసీపీలో చేరిన గోరుముచ్చు గోపాల్ యాదవ్

image

టీడీపీ ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆ పార్టీని వీడి మంగళవారం వైసీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గోరుముచ్చు గోపాల్ యాదవ్‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వకపోవడం కారణంగానే వైసీపీ పార్టీలో చేరినట్లు సమాచారం.

News March 26, 2024

VZM: ఈవీఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్

image

స్థానిక ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన గ‌దుల‌ను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం మ‌ళ్లీ గోదాముల‌కు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను త‌నిఖీ చేశారు. ఈవీఎంల తొలిద‌శ త‌నిఖీకి ఏర్పాట్లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు.

News March 26, 2024

కంకిపాడు: విద్యాసంస్థలో బాలిక మృతి

image

కంకిపాడులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. త్రిపురకి చెందిన విద్యార్థిని క్యాంపస్‌లో హాస్టల్ నుంచి క్లాస్ రూంకి స్నేహితులతో కలిసి మంగళవారం వెళ్తుండగా అకస్మాత్తుగా పడిపోయింది. కాలేజీ స్టాఫ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు.

News March 26, 2024

వైపాలెం: గుండె పోటుతో గిరిజనుడు మృతి

image

యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గాంధీ నగర్ గిరిజన గూడేనికి చెందిన కుడుముల వీరన్న (33) గుండె పోటుతో మంగళవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరన్నకు గుండెల్లో నొప్పిగా ఉండడంతో ఐటీడీఏ అంబులెన్స్‌కు సమాచారం అందజేసి వీరన్నను యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.

News March 26, 2024

కోడూరు: బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

image

రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాహిల్, జస్వంత్‌ను తిరుపతి హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ గారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు కోడూరులో పదో తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.

News March 26, 2024

వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేలా చూస్తా: CBN

image

ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.