India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయచోటిలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారంలో టీడీపీ శాసనసభ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ షాప్ వద్ద ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం, టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు.
మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లే అనురాధను వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె తండ్రి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె మొదటిసారి 2021లో కె. కోటపాడు మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.
విజయవాడ గుణదల విజయనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చానంటూ హల్ చల్ చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాచవరం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికలవేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఓటర్ కార్డ్ ఆన్లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ఫోన్‌కు లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.
మందస మండలం చిన్న సువర్ణపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి సాలిని గున్నయ్య (40) అనే వ్యక్తి పనికి వెళ్లాడు. పని చేస్తూ అక్కడే ఉన్న ఓ ఇనుప చువ్వను ముట్టుకున్నాడు. దానికి కరెంట్ ప్రసరించడంతో ఆయన కరెంట్ షాక్‌కు గురయ్యాడు. సహచరులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం అందిచారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఓ వ్యక్తిపై కోడి కత్తులతో దాడి చేసిన ఘటన మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది. పోలీసుల కథనం.. పులివెందులకు చెందిన శ్రీనివాసులు తన చెల్లెలును మదనపల్లి(మం) సీటీఎంలోని శేఖర్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. భర్త చనిపోవడంతో ఆ ఆస్తిపై బంధువులు కన్నేసి ఆమెను బెదిరిస్తుండడంతో అన్నకు ఫోన్ చేసింది. సీటీఎం వచ్చి నిలదీసిన శ్రీనివాసులును ఇద్దరు వ్యక్తులు కోడికత్తులతో దాడిచేసి హత్యయత్నానికి పాల్పడ్డారు.
ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత, వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలు” పై తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏలూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చింతలపూడి మండలం కంచనగూడెం SGT మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చంచంరాజు టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఎస్.అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించరాదని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.