India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోపాడు సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కందుకూరు పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా మోపాడు సమీపంలో పొగాకు చెక్కలు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో డాల లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మచిలీపట్నం ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి ఈ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా, గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ నరసింహారావు పేరు కూడా పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని రెండ్రోజుల్లో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు.. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పార్టీలోని అసమ్మతి నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీలో రాంకుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు టీడీపీలో సీటు దక్కలేదని కీలక నేత మస్తాన్ యాదవ్ ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.
హిందూపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. బీజేపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బీకే.పార్థసారథిని కూటమి ఖరారు చేసింది. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తానంటున్నారు.
జిల్లాలోని అన్ని చెక్ పోస్టులలో 3 షిఫ్టులలో పోలీసు అధికారులు, సిబ్బందితో నిఘా పెంచామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. విలువైన వస్తువులకు రశీదు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆధారాలు చూపితే పరిశీలించి నిబంధనల మేరకు పట్టుబడిన వాటిని అందిస్తామన్నారు. జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. నిరంతరం సిబ్బంది విధుల్లో ఉండి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.
కర్నూలు MP స్థానానికి YCP, TDP నుంచి BC సామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. కురువ సామాజిక వర్గానికి చెందిన MPTC సభ్యుడు నాగరాజు TDP నుంచి, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ BY రామయ్య YCP నుంచి బరిలో దిగనున్నారు. ఇద్దరు సామాన్యులకు టికెట్లు కేటాయించి సామాజిక సమీకరణలో ఇరు పార్టీలు సమతుల్యం పాటించాయి. అయితే గెలిచి నిలిచేదెవరో కామెంట్ చేయండి.
గూడూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. YCPని వీడి BJPలో చేరిన గూడూరు MLA వరప్రసాద్‌కు ఆ పార్టీ తిరుపతి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో తొలిసారిగా గూడూరుకి వచ్చిన ఆయనకు TDP, జనసేన, BJP శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పొత్తులో భాగంగా గూడూరు నుంచి పాశం సునీల్, తిరుపతి MP అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు.
రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల టీమ్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా 23 వేలమంది ఎన్నికల సిబ్బందిని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం 7,200 మంది పోలీసు బలగాలు అవసరమని నిర్ణయించారు. మొత్తం ఐదు కంపెనీల బలగాలకు ఇప్పటి వరకు నాలుగు కంపెనీల బలగాలు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.