Andhra Pradesh

News March 26, 2024

కోటబొమ్మాళి: చేపల వ్యాను బోల్తా

image

జాతీయ రహదారిపై కొత్తపేట కూడలి వద్ద ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంవైపు చేపలలోడుతో వెళ్తున్న వ్యాను టైరుపంక్చర్ కావడంతో సోమవారం బోల్తా పడింది. ఆక్సిజన్ సిలెండర్లు, నీటి ట్యాంకులు చెల్లాచెదురుకావడంతో చేపలు రహదారి పక్కన పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. వాహనంలో డ్రైవర్‌, మరోవ్యక్తి గాయాలు కాలేదు.

News March 26, 2024

ఆస్పరి: చేతి గుర్తు రక్తపు మరకలు

image

ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌‌తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.

News March 26, 2024

చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 26, 2024

నేటి నుంచి నావికా దళ విన్యాసాలు

image

నేటి నుంచి కాకినాడ సాగరతీరంలో భారత్‌- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలో నిర్వహించనున్న టైగర్‌ ట్రంప్‌ విన్యాసాల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ పరిధిలో ఆరు రోజుల పాటు నేవీ, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తాయన్నారు.

News March 26, 2024

‘కోడ్’.. ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌-మోనిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. పెయిడ్‌ న్యూస్‌, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు.

News March 26, 2024

విశాఖ ఉక్కులో రికార్డు స్థాయి ఉత్పత్తి

image

విశాఖ ఉక్కు కర్మాగారం వైర్ రాడ్ మిల్ (WRM) -2 విభాగంలో 2023-24 ఏడాదికి రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. విభాగం ప్రారంభం నాటి నుంచి పరిశీలించగా, ఈ ఏడాది 6 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి నిర్ణీత సామర్థ్యాన్ని అధిగమించినట్లు వివరించారు. విభాగం అధికారులను, ఉద్యోగులను ఉక్కు సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్ (ఆపరేషన్స్ ప్రాజెక్ట్) అభినందించారు.

News March 26, 2024

విశాఖ: ‘కోల్ కతా జూ నుంచి జిరాఫీలు తీసుకువస్తాం’

image

విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఆదివారం మగ జిరాఫీ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో కోల్ కతా అలీపూర్ జూ పార్క్ నుంచి రెండు జిరాఫీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియ తెలిపారు. దీనికోసం సెంట్రల్ జూ అథారిటీకి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. వాటిని తీసుకురావడానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

News March 26, 2024

నేడు విశాఖ రానున్న యూకే డిప్యూటీ హై కమిషనర్

image

యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ విశాఖ నగరానికి మంగళవారం వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని స్థానిక అధికారులు తెలిపారు. తిరిగి బుధవారం రాత్రి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని అన్నారు.

News March 26, 2024

ఎంపీ ‘RRR’ పోటీపై ఆసక్తి.. ‘పశ్చిమ’ నుంచే బరిలో..?

image

నరసాపురం MP రఘురామరాజు ఉమ్మడి ప.గో జిల్లాలోనే ఏదైనా స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం BJP టికెట్ ఆయనకేనని అంతా భావించగా.. శ్రీనివాసవర్మ అనే మరో నేతకు టికెట్ దక్కింది. దీంతో RRRకు ‘పశ్చిమ’లో TDP నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఇప్పటికే అక్కడ అభ్యర్థులందరూ ఖరారు కాగా.. ఎవరినైనా ఆపి RRRకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట.

News March 26, 2024

ఎంపీ ‘RRR’ పోటీపై ఆసక్తి.. ‘పశ్చిమ’ నుంచే బరిలో..?

image

నరసాపురం MP రఘురామరాజు ఉమ్మడి ప.గో జిల్లాలోనే ఏదైనా స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం BJP టికెట్ ఆయనకేనని అంతా భావించగా.. శ్రీనివాసవర్మ అనే మరో నేతకు టికెట్ దక్కింది. దీంతో RRRకు ‘పశ్చిమ’లో TDP నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఇప్పటికే అక్కడ అభ్యర్థులందరూ ఖరారు కాగా.. ఎవరినైనా ఆపి RRRకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట.