India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మురళీక్రిష్ణ శనివారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇరువురు హర్ష (21) వెంకటేష్ (21) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులుగా తెలుస్తోంది.. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల కోడు ఉల్లంఘనలో భాగంగా ఎల్కోట మండలం ఖాసాపేట సచివాలయం పరిధిలో క్లస్టర్-6 వాలంటీర్ బొబ్బిలి శివను తొలగించినట్లు ఎల్ కోట ఎంపీడీవో కే రూపేష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌లో రాజకీయ నాయకుల స్టేటస్లు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు పై ఇతనిపై చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న అందరికీ నిబంధన వర్తిస్తుంది అన్నారు.
ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్‌పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.
పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఏ, బీఎల్ చదివారు. 1961 మే 15న జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప MLA అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. YCP సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఆమె ఆమె తలపడనున్నారు. ఈమె ప్రస్తుతం కడపలో నివశిస్తున్నా.. సొంత ఊరు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామం అని తెలిపారు. ఈమె భర్త కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శనివారం ఉదయం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిలో హోటల్ నిర్వాహకుడు దామోదర్ ఈరోజు ఉదయం బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొని తలకు తీవ్ర గాయమై మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. భౌతికశాస్త్రం పరీక్షలకు మొత్తం 25256 విద్యార్థులు హాజరయ్యారు. 826 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి ఫిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం భౌతిక శాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. మొత్తం హాజరు శాతం 96.83 నమోదు అయిందన్నారు.
భీమవరం నియోజకవర్గానికి 1955, 1962లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాచు వెంకట్రామయ్య కాంగ్రెస్ తరఫున వరుస విజయాలు సాధించారు. 1967లో సైతం కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా బి.విజయ్ కుమార్ రాజు పోటీలో నిలిచి 9207 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య హ్యాట్రిక్ విజయానికి అడ్డుపడింది. 1972 నాటికి విజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరి మరోసారి విజయం సాధించారు.
కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.