India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను మే 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత షెడ్యూల్ ను సవరించినట్లు పేర్కొన్నారు. సెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే 0884 2359599, 0884 2342499 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను https://vizianagaram.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా TDP ఆరుసార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మానప్రసాద్ రావు.. టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించారు. ఈసారి YCP తరఫున ధర్మానకే టిక్కెట్ ప్రకటించారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరుంటే ధర్మానకు పోటీగా నిలిస్తారని మీరు భావిస్తున్నారు?
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 703 లైసెన్స్ హోల్డర్లు ఉండగా, 654 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రక్రియ ముగిసే వరకు ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.
మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యా ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 23వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపించారు. జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై ఆయన అక్కడికక్కడే చర్యలు తీసుకొంటామన్నారు.
కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సృజన తెలిపారు. కోడ్ వచ్చినప్పటి నుంచి 20వ తేదీ వరకు పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఉన్న 15,115, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్న 5,649 గోడ రాతలు, పోస్టర్లు, బ్యానర్లు, తదితరాలను తొలగించామన్నారు. కోడ్ ఉల్లంఘించిన 12మంది వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
ఉయ్యూరులో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఉయ్యూరు టౌన్ సిఐ హబీబ్ బాషా తెలిపిన వివరాలు మేరకు.. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. ముగ్గురు మహిళలు, ఓ విటుడుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉయ్యూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లపై తొలగింపులు కొనసాగుతున్నాయి. బుధవారం సింగరాయకొండలో మంత్రి సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేశ్, సిరిమల్లె మణికంఠ, దేపూరి శివయ్య పాల్గొన్నారు. దీనిపై అధికారులు స్పందించి.. విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో నగేశ్ కుమారి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో తొలగింపులు జరిగాయి.
మహిళ ఫిర్యాదు మేరకు TDP సీనియర్ నేత మోదుగుల పెంచలయ్యపై కేసు నమోదు చేసినట్లు రాజంపేట పట్టణ CI మద్దయ్య చారి తెలిపారు. వారి వివరాల మేరకు.. రాజంపేటలోని ఉస్మాన్ నగర్‌లో నివాసం ఉన్న ఒంటరి మహిళ ఇంటి వద్దకు బుధవారం రాత్రి పెంచలయ్య వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, బలవంతం పెట్టాడని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకొని మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.