Andhra Pradesh

News March 21, 2024

లక్కిరెడ్డిపల్లి: బావిలో దూకి ఆత్మహత్య

image

లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

News March 21, 2024

దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి : టీడీపీ

image

ప్రత్తిపాడు అసెంబ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులుపై దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు గురువారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కావాలని వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని వివరించారు.

News March 21, 2024

విజయవాడ వెస్ట్ టికెట్‌పై ముదిరిన వివాదం

image

విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.

News March 21, 2024

నెల్లూరు: నిన్న YCP లో.. నేడు TDPలో చేరిక

image

బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన గుత్త శ్రీనివాసులు YCPని వీడి TDPలో చేరారు. ఈసందర్భంగా రేబాల గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయన నిన్న ఎమ్మెల్యే ప్రసన్న, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో YCPలో చేరిన విషయం తెలిసిందే. ఆయన వెంట TDP నాయకులు సురా శ్రీనివాసులురెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పుట్ట సుబ్రహ్మణ్యంనాయుడు, హరికృష్ణ తదితరులు ఉన్నారు

News March 21, 2024

ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సీ విజిల్ ఫిర్యాదులను 100% పరిష్కరించాలని సూచించారు. గురువారం ఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 4 రోజులు గడిచినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.

News March 21, 2024

ఎన్నికలవేళ… జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు..

image

సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.

News March 21, 2024

అమలాపురం: బీజేపీలోకి వైసీపీ MP భర్త

image

అమలాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీలో కొనసాగుతుండగా ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరిన మూర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరిని గురువారం కలిశారు. పి.గన్నవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా మూర్తి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 

News March 21, 2024

కుప్పంలో చంద్రబాబు పర్యటన

image

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25న రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.

News March 21, 2024

కామవరపుకోట: ఫోక్సో కేసులో దేవాదాయ శాఖ ఉద్యోగి

image

కామవరపుకోట మండలంలో ఓ మైనర్ బాలికపై దేవాదాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నరసింహారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు బంధువుల ఫిర్యాదు మేరకు గురువారం తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ఎండోమెంట్ పరిధిలో నరసింహారావు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 21, 2024

పులివెందుల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

ఈనెల 18వ తేదీన పులివెందులలోని నగిరిగుట్టలో జరిగిన రెంటాల బాబు హత్య కేసులో ముద్దాయి రెంటాల సురేశ్‌ను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. రెంటాల అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. కూర వేయలేదనే కారణంతో బాబుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని వివరించారు.