India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా కలెక్టర్ కమ్ జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన ఏడుగురు, కర్నూలుకు చెందిన ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ మేరకు సంబంధిత వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.
గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
గతేడాది ఆగస్టులో అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
విశాఖ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్ గంగూలీ, డేవిడ్ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, ఆ దేశ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం వసతిగృహ విద్యార్థినులతో సందడి చేశారు. సంచయిత గజపతిరాజు ఆధ్వర్యంలో పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత బయో టాయ్‌లెట్లను ప్రారంభించారు. అంతకు ముందు గిరిజన విద్యార్థినులంతా థింసా నృత్యంతో స్వాగతం పలికారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎంఫార్మసీ మూడో సెమిస్టర్, ఫార్మాడీ ఒకటి, రెండు, మూడో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన 1.11 లక్షల ఓటరు ఎపిక్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్‌కు చేరాయి. ఈనెల 17న 81 వేలు, ఈనెల 18న 30 వేలు మొత్తం 1.11 లక్షల కార్డులు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిని స్కాన్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. ఆ శాఖ నుంచి జిల్లాలోని సంబంధిత ఓటర్ల చిరునామాకు పోస్టు ద్వారా చేరవేయనున్నారు.
ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Sorry, no posts matched your criteria.