Andhra Pradesh

News July 4, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

image

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు.‌ PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.

News July 4, 2025

GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

image

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

News July 4, 2025

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

image

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.

News July 4, 2025

నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.

News July 4, 2025

విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.

News July 4, 2025

విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

image

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.

News July 4, 2025

V.M.R.D.A. పరిధిలో అభివృద్ధి పనులకు ఆమోదం

image

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు.‌ వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.

News July 4, 2025

20 బైకులను ప్రారంభించిన SP

image

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News July 4, 2025

ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

image

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.