India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ టాప్-2 సైంటిస్టుల జాబితాలో చోటు దక్కింది. మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ శంకర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వీరాంజనేయరెడ్డి 2025 ఎడిషన్‌లో స్థానాన్ని దక్కించుకున్నారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
APSRTC అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DPTO జగదీష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో డీజల్ మెకానిక్స్ 33, మోటర్ మెకానిక్స్ 2, ఎలక్ట్రీషియన్స్ 8, వెల్డర్ 1, ఫిట్టర్ 3 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పరిధిలో ITI చదివిన వారు మాత్రమే అర్హులు. అక్టోబర్ 4వ తేదీ లోపు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్ మోసగాడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబు బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసేవాడు. ఈ నేపథ్యంలో రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వద్ద షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతానని నమ్మించి రూ.2 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా అతడి బ్యాంకు అకౌంటుకు ఇతని మొబైల్ నెంబరును లింకు చేసుకుని దాదాపు రూ.కోటికి పైగా మోసం చేశాడు.
వాట్సాప్ గ్రూపులో వచ్చే APK ఫైల్స్ పట్ల జాగ్రత్త వహిస్తూ డౌన్లోడ్ చేయొద్దని SP డా. అజిత వెజెండ్ల తెలిపారు. అనధికారిక యాప్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. ఆఫర్స్ కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవద్దన్నారు. APK ఫైల్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల మొబైల్, కంప్యూటర్‌లో వైరస్ చేరే అవకాశం ఉంటుందన్నారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు అధికారులపై వేటు పడింది. రిమాండ్ ఖైదీ బ్లాక్ మార్చేందుకు వారి బంధువులు నుంచి నగదు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు జైలు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.. చీఫ్ హెడ్ వార్డెన్ హనుమంత్ రెడ్ది, డిప్యూటీ జైలర్ విజయ్ కుమార్ లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జైళ్ల శాఖలో సంచలనం కల్గిస్తుంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ ఘటన తర్వాత జైళ్ల శాఖ అప్రమత్తమైంది.
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవం సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్లకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్కాన్ చేస్తే లొకేషన్‌ల జాబితా మొబైల్‌లో ప్రత్యక్షమై, కావలసిన స్థలాన్ని ఎంచుకుని గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భక్తులు ఈ సౌకర్యాన్ని వాడుకొని సులభంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.
పొదలకూరు మండలం తాటిపర్తి చెరువు వద్ద ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడింది. సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బంది కారు డ్రైవర్‌ని బయటకి తీసి కాపాడారు. ఆతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. పొదలకూరు నుంచి సంగం వైపుగా వెళ్తున్న కారు అక్కడ రోడ్డుపై పోసిన వడ్ల రాశిని ఎక్కించడంతో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతగిరి మండలంలో డముకు వ్యూ పాయింట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిషోర్ (32)అనే యువకుడు అరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యంపై యాజమాన్యాలు బంద్‌ను ప్రకటించాయి. సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశామని డిగ్రీ కళాశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.