Andhra Pradesh

News December 22, 2025

క్రిస్మస్‌కు ఒంగోలు మీదుగా స్పెషల్ ట్రైన్..!

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలుమీదుగా వేళాంగిణికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాదు నుంచి వేళాంగిణికి స్పెషల్ ట్రైన్ (07407) చీరాల, ఒంగోలు మీదుగా 23వ తేదీన ప్రయాణిస్తుందన్నారు. అలాగే వేళాంగిణి నుంచి సికింద్రాబాదుకు (07408) స్పెషల్ ట్రైన్ 25వ తేదీన ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News December 22, 2025

పోరాటానికి సిద్ధమైన విశాఖ ఉక్కు భూ నిర్వాసితులు

image

విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 4న పాత గాజువాకలో భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. సుమారు 8,500 మంది ఆర్-కార్డు దారులకు న్యాయం చేయాలని, మిగులు భూములను పంపిణీ చేయాలని నిర్వాసితుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. భూమి ఇచ్చే వరకు నెలకు రూ.25,000 భృతి చెల్లించాలని కోరుతూ 64 గ్రామాల నిర్వాసితులు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News December 22, 2025

ప్రకాశం: ఓపెన్‌లో టెన్త్, ఇంటర్ రాస్తున్నారా..!

image

ప్రకాశం జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను డీఈఓ రేణుక ప్రకటించారు. వచ్చే మార్చి 2 నుంచి 13 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 16 నుంచి 28 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష ఫీజులు తగిన అపరాధ రుసుము చెల్లించి ఈనెల 26 వరకు ఆన్లైన్‌లో చెల్లించవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్స్, విద్యార్థులచo పరీక్ష ఫీజు చెల్లించేలా చేయాలన్నారు.

News December 22, 2025

రాజమండ్రి: కాశీ నవీన్ కుమార్‌ను సత్కరించిన జవహర్

image

తూ.గో జిల్లా TDP ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్‌కుమార్‌ను ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం రాజమండ్రిలోని R&B గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈభేటీలో నవీన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసే సీనియర్ నాయకులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, నవీన్ నియామకమే ఇందుకు నిదర్శనమని జవహర్ కొనియాడారు.

News December 22, 2025

అనంతపురం: కరెంటోళ్ల జనబాట పోస్టర్ ఆవిష్కరణ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో AP SPDCL కరెంట్ టోళ్ల జన బాట పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో కరెంట్ టోళ్ల జన బాట పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News December 22, 2025

విశాఖ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖ జిల్లా ప్రజలు ఇకపై భవనాలు, ఖాళీ స్థలాల సర్వే సర్టిఫికెట్ల కోసం జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కమిషనర్ వినూత్న ఆలోచనతో రూపొందించిన ఆన్‌లైన్ విధానాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ప్రారంభించారు. ​www.gvmc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

News December 22, 2025

కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

image

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్‌కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

News December 22, 2025

ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News December 22, 2025

టైమ్ బాండ్ ప్రకారం PGRS అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను టైమ్ బాండ్ ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సమీక్షించిన కలెక్టర్ తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఈ-ఆఫీల్ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా చురుగ్గా వ్యవహరించాలన్నారు.

News December 22, 2025

అత్యున్నత ప్రమాణాలతో ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ: SP

image

కడప జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 194 మంది సివిల్, 330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు, ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిజాయతీతోపాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి, సైబర్ నేరాల దర్యాప్తుపై పట్టు సాధించాలని సూచించారు.