Andhra Pradesh

News October 2, 2024

గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శం: ఎస్పీ

image

మహాత్మ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు.

News October 2, 2024

షెడ్యూల్లో మార్పు.. బందరు పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొద్దిసేపటి కిందటే ఆయన బందరు పోర్టుకు బయల్దేరారు. మచిలీపట్నం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. కాగా, షెడ్యూల్లో మార్పులు చేసుకొని పోర్టుకు బయల్దేరారు. కాగా, మచిలీపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోర్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News October 2, 2024

కడప పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

image

గాంధీ జయంతి సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్ర్యం అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు.

News October 2, 2024

సత్య.. నీ వాటాలు నీకు అందాయా?: కేతిరెడ్డి

image

మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సత్య.. ధర్మవరం ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన పాపానికి నువ్వు, నీ కూటమి పార్టీ నేతలైన జనసేన, టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వాటాలు వేసుకుంటూ ప్రజల్ని భయపెట్టి ఇప్పటికే ఎంతో మంది దగ్గర వసూళ్లు చేశారు. నీ వాటాలు నీకూ అందాయి కదా?’ అంటూ కేతిరెడ్డి ట్వీట్ చేశారు.

News October 2, 2024

ప్రకాశం వస్తున్నారా.. అయితే ఇవి చూసేయండి.!

image

దసరా సెలవుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. అయితే ఈ పర్యాటక ప్రదేశాలను మిస్ కావద్దు. జిల్లాలో భైరవకోన, కొత్తపట్నం, రామాయపట్నం, పాకల బీచ్‌లు, వల్లూరమ్మ తల్లి ఆలయం, కంభం చెరువు, మాలకొండ స్వామి ఆలయం, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. దసరా సెలవులు అనగానే మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయండి.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

రాజమండ్రి: ‘చమురు సంస్థల నుంచి పరిహారం ఇప్పించాలి’

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న పలువురు మత్స్యకారులకు చమురు సంస్థలు నుంచి పరిహారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులందరికి పరిహారం ఇప్పించాలని కోరారు.

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహాయ యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వరం ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలున్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.